సినిమాల్లో నేషనల్ క్రష్ అవ్వడం అంటే అంత ఈజీనా అనిపించేలా ఇటీవల అయింది కొత్త క్రష్ రుక్మిణి వసంత్. అప్పటివరకు రష్మిక మందనను క్రష్ అని పిలుస్తూ మురిసిపోయిన అభిమానులు ఇప్పుడు ఆ బిరుదు రుక్మిణి వసంత్‌కి ఇచ్చేశారు. ‘సప్త సాగరాలు దాటి’తో కుర్రకారు కలల రాణి అయిన ఆమె.. ‘కాంతార 2’ తర్వాత క్రష్‌గా మారిపోయింది. ఇప్పుడు ఈ క్రష్ మాస్ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమాల్లో నటిస్తోంది. అయినా ఇంకా కుర్రాళ్లు ఆమెను క్రష్‌గానే ఆరాదిస్తున్నారు.
అలాంటి హీరోయిన్ మీద టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని దృష్టి పడింది. దక్షిణాదిలోనే కాక ఉత్తరాదిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణీ వసంత్. ఇప్పడు యశ్ – గీతూ మోహన్ దాస్ సినిమా ‘టాక్సిక్’తోపాటు ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ఇనిమా ‘డ్రాగన్’ సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడామె తెలుగులో మరో కొత్త సినిమా కబురు వినిపించే అవకాశమున్నట్లు సమాచారం. నాని సొంత నిర్మాణ సంస్థ వాల్‌పోస్టర్ సినిమా పతాకంపై నిర్మించనున్న ఓ కొత్త సినిమా కోసం ఆమెను నాయికగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
‘దండోరా’ సినిమా ఫేమ్ మురళీకాంత్ ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలిసింది. ఇప్పుడు ఈ సినిమా పూర్వ నిర్మాణ పనులు సాగుతున్నాయి. త్వరలోనే సినిమాను అధికారికంగా అనౌన్స్ చేస్తారట. ఈ సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ అని అంటున్నారు. అందుకే హీరోయిన్‌ని ముందే ఓకే చేసి.. ఆ తర్వాత యువ హీరో పాత్ర గురించి వెతుకులాట ప్రారంభించాలని అనుకుంటున్నారట. మరి ఆ హీరో ఎవరు అనేది చూడాలి.
ఇది కాకుండా రుక్మిణి మరో తెలుగు సినిమాకు కూడా ఓకే చెప్పింది అని సమాచారం. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ రూపొందించనున్న ప్రాజెక్ట్‌లో ఆమెనే నాయిక అని టాక్. అయితే ఈ సినిమా ఇప్పడు స్టార్ట్ అవుతుందా? లేక చరణ్ సినిమా లైనప్ మారుతుందా అనేది ఇప్పుడు తేలడం లేదు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది.