బాలీవుడ్ ఛాన్స్ ని వద్దన్నా తమన్నా, పూజా హెగ్డే

బాలీవుడ్ సినిమాలో నటించాలని చాలామంది కలలుకంటుంటారు. ఒక్క ఛాన్స్ వస్తే చాలు.. దానితో అక్కడే స్థిరపడిపోదామని ఆశపడుతుంటారు. కానీ బాలీవుడ్ అవకాశం తలుపు తట్టినా తమన్నా వద్దని చెప్పింది. ఈ ఛాన్స్ ఆమెకు కొత్త కాకపోయినప్పటికీ నో చెప్పడంతో ఈ వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఆ ఛాన్స్ యువ హీరోయిన్ పూజా హెగ్డే వద్దకు వచ్చింది. ఆమె ఎగిరి గంతులు వేస్తుందనుకుంటే.. సింపుల్ గా సారీ చెప్పింది. ఎందుకు ఇద్దరు హీరోయిన్స్ నో చెప్పాల్సి వచ్చింది ? ఏంటా సినిమా? ఎవరా హీరో?.. వివరాల్లోకి వెళితే… జాన్‌ అబ్రహాం, మనోజ్‌ బాజ్‌పేయి లతో “రాక్‌” అనే సినిమాని డైరక్టర్ మిలాప్‌ ఝవేరి తెరకెక్కించాలని అనుకుంటున్నారు.

నిఖిల్‌ అద్వానీ భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ సినిమాకి వేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. ఆరిస్టుల ఎంపిక సాగుతోంది. హీరోయిన్స్ ఫిక్స్ అయిపోతే షూటింగ్ షురూ చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా తమన్నా, పూజా హెగ్డే లను సంప్రదిస్తే.. సారీ చెప్పారంట. ఇందుకు కారణం అందులో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండడమేనని సమాచారం. అంతేకాకుండా ఈ మధ్య జాన్ అబ్రహం కి మంచి హిట్స్ లేవు.. సో.. సాహసం చేసి అందాలు ఆరబోసినా ఫలితం ఉండదని ఈ భామలు నో చెప్పారని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus