మిల్కీ బ్యూటీ తమన్నా ఈమధ్య బాగా వార్తల్లో నిలుస్తోంది.. న్యూయర్ సెలబ్రేషన్స్‌లో యాక్టర్ విజయ్ వర్మకి ముద్దులిస్తూ వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం వీరిద్దరూ రిలేషన్ షిప్లో ఉన్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.. 30 ప్లస్‌లో ఉన్న తమన్నా పెళ్లి గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి కానీ క్లారిటీ ఇవ్వకుండా అవన్నీ పుకార్లేనని కొట్టిపారేస్తూ వస్తోందీ బాంబే బ్యూటీ.. తమ్మూ సోషల్ మీడియాలో చేసే హంగామా మామూలుగా ఉండదు..
గ్లామరస్ ఫోటోషూట్స్, ట్రెండీ రీల్స్, అదరహో అనిపించేలా అందాల ఆరబోతతో యూత్ పోరగాళ్లకు పిచ్చెక్కిస్తుంటుంది.. తెలుగుతో పాటు హిందీ, తమిళ్లోనూ సీనియర్ అండ్ యంగ్ స్టార్ హీరోలందరితో ఆడిపాడింది.. నటించిన మూడు భాషల్లోనూ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది.. ఇప్పుడు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘భోళా శంకర్’ మూవీలో యాక్ట్ చేస్తోంది.. ‘సైరా’ తర్వాత చిరుతో తను చేస్తున్న సెకండ్ ఫిలిం ఇది..
ఇక ఎప్పటికప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టు లేటెస్ట్ ఫ్యాషన్స్‌తో సందడి చేస్తుంటుంది.. లగ్జరీ లైఫ్ స్టైల్‌కి స్టైలిష్ కాస్ట్యూమ్స్‌తో మిల్కీబ్యూటీ వాడ్రోబ్ నిండిపోతుంది.. తన స్టైలింగ్ ఎప్పుడూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది.. తమన్నా వేసుకున్న కొన్ని డ్రెస్సెస్, వాటి బ్రాండ్స్ అండ్ రేట్స్ గురించిన వివరాలు ఇప్పుడు చూద్దాం..