Tamanna Husband: కాబోయే భర్తను క్రియేటివ్‌గా ఇంట్రడ్యూస్ చేసిన తమన్నా..!

  • November 17, 2022 / 06:46 AM IST

సెలబ్రిటీల వెడ్డింగ్స్‌కి సంబంధించి ఇప్పటివరకు ఎన్నో రకాల వార్తలు చూశాం.. కానీ తమన్నా పెళ్లి విషయంలో మాత్రం వ్యవహారం కాస్త వెరైటీగానే ఉంది.. కొద్దిరోజులుగా మిల్కీబ్యూటీ మ్యారేజ్ ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో జరుగబోతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.. ఇటీవల ‘‘ప్రొఫెషనల్‌‌‌గా బిజీగా ఉండడం వల్ల పర్సనల్ లైఫ్ మీద పెద్దగా ఫోకస్ చెయ్యలేకపోయాను.. పెళ్లికి నేనేం వ్యతిరేకిని కాను.. వీలు చూసుకుని, వెడ్డింగ్ చేసుకుని పిల్లల్ని కూడా కంటాను’’ అని కామెంట్ చేసింది.. అప్పటినుండి తమ్మూ పెళ్లిపై రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి..

కెరీర్ స్టార్ట్ చేసి 15 ఏళ్లకు పైనే అయింది.. కాజల్, నయనతార లాంటి వాళ్లు అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్నారు.. తనకంటే చిన్నదైన హన్సిక కూడా కాబోయే వాణ్ణి పరిచయం చేసేసింది.. ఇక తమన్నా వంతే అని కాస్త గట్టిగానే ఫిక్స్ అయిపోయారు.. అందరూ అనుకుంటున్నట్టుగానే తమన్నా తను కట్టుకోబోతున్న వ్యక్తి ఎవరనేది రివీల్ చేసేసింది.. కాకపోతే కాస్త వెరైటీగా పరిచయం చేసిందంతే.. తన పెళ్లి మాట నిజమేనంటూ.. చీరతో లోపలికి వెళ్లి..

మగాడి వేషంలో బయటకొచ్చి.. ‘‘ఇంట్రడ్యూసింగ్ మై బిజినెస్‌మెన్ హస్బెండ్’’.. అంటూ తన పెళ్లి గురించి పోస్ట్ చేసిన పేజ్‌ని ట్యాగ్ చేసింది.. అంతేనా.. ‘‘మ్యారేజ్ రూమర్స్.. ప్రతిఒక్కరూ నా లైఫ్ గురించి స్క్రిప్ట్ రాసేస్తున్నారు’’ అనే హ్యాష్ ట్యాగ్స్ కూడా యాడ్ చేసింది.. సాధారణంగా సెలబ్రిటీల విషయాల్లో పువ్వు పూసింది అంటే కాయ కాసింది.. మేం కోసుకు తిన్నాం.. టేస్ట్ బాగుంది అన్నట్టు ఉంటేనే వార్తలనేవి వైరల్ అవుతుంటాయ్.. మరి మన మిల్కీ బ్యూటీ కూడా తన పెళ్లి గురించి వస్తున్న న్యూస్ చూసి.. కోపాన్ని ఇలా క్రియేటివ్‌గా చూపించినట్టుంది..

‘‘వావ్, అబ్బాయి బాగున్నాడు.. నిశ్చితార్థం ఎప్పుడు..? హే, కుర్రాడు కత్తిలా ఉన్నాడు.. నీ ఏజ్ హీరోయిన్స్ కూడా ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి? అనే విషయం గురించి నీదగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి’’ అంటూ తమలోనూ క్రియేటివిటీ ఉందని తమన్నాకి అర్థమయ్యేలా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు..

 

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus