Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

నాని ‘ఎం.సి.ఎ’ సినిమా విలన్ విజయ్ వర్మతో ప్రేమాయణానికి ఫుల్‌స్టాప్ పెట్టిన మిల్కీ బ్యూటీ తమన్నా, ఇప్పుడు తన పెళ్లి, కాబోయే భర్త గురించి మాట్లాడి మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ‘డు యు వానా పార్టనర్’ అనే షోలో పాల్గొన్న తమన్నా, తన మనసులోని మాటలను బయట పెట్టింది.ఈ షోలో తనకు కాబోయే భాగస్వామి ఎలా ఉండాలనే దానిపై తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Tamannaah Bhatia

‘గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకున్న వ్యక్తికే నేను భార్యగా దొరుకుతాను’ అంటూ పరోక్షంగా విజయ్ వర్మపై సెటైర్ వేసింది తమన్నా. అంతేకాదు, ఆ అదృష్టవంతుడి కోసం ఒక ‘స్పెషల్ ప్యాకేజీ’ కూడా సిద్ధం చేస్తున్నానంటూ ఊరించి, టాపిక్‌ను మరింత స్పైసీగా మార్చేసింది. ప్రస్తుతం తానో గొప్ప లైఫ్ పార్టనర్ గా మారేందుకు ప్రయత్నిస్తున్నానని కూడా తెలిపింది.ఇదే కార్యక్రమంలో, స్నేహితులతో వ్యాపారం చేయడంపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టింది. తన ప్రాణ స్నేహితురాలు, నటి ప్రగ్యా జైస్వాల్ వంటి వారితో స్నేహాన్ని ఎప్పటికీ వ్యాపారంతో ముడిపెట్టనని, ఆ బంధాన్ని ఎంతో గౌరవిస్తానని తమన్నా తేల్చి చెప్పింది.

ప్రస్తుతం పర్సనల్ లైఫ్‌లోనే కాదు, ప్రొఫెషనల్‌గానూ తమన్నా ఫుల్ బిజీగా ఉంది. బాలీవుడ్‌లో అజయ్ దేవగన్‌తో ‘రేంజర్’, రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఓ సినిమాతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి.తమన్నా గత చిత్రం ‘ఓదెల 2’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాతకు లాభాలు పంచింది కానీ సినిమాపై నమ్మకంతో డిస్ట్రిబ్యూట్ చేసిన బయ్యర్స్ కి మాత్రం నష్టాలే మిగిల్చింది. గత ఏడాది చేసిన ‘అరణ్మనై 4’ మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus