2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

టాలీవుడ్‌లో పండగ సీజన్ వచ్చిందంటే చాలు, బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్ధమే జరుగుతుంది. ముఖ్యంగా సంక్రాంతి బరిలో నిలవాలని ప్రతి హీరో కలలు కంటాడు. అయితే 2026 సంక్రాంతి సమరం కేవలం హీరోల మధ్యే అనుకుంటే పొరపాటే. ఈసారి హీరోయిన్ల మధ్య కూడా గట్టి పోటీ నెలకొంది. గ్లామర్‌తో, నటనతో పండగ విజయాన్ని అందుకునేందుకు స్టార్ హీరోయిన్ల నుంచి యంగ్ బ్యూటీస్ వరకు అందరూ సై అంటున్నారు.

2026 Sankranthi Movies

ఇంతకీ ఆ అందాల భామలు ఎవరో, ఏయే సినిమాలతో వస్తున్నారో ఓ లుక్కేద్దాం.సంక్రాంతి రేసును అందరికంటే ముందుగా ప్రభాస్ ‘రాజాసాబ్’ చిత్రంతో మొదలు పెట్టబోతున్నారు ముగ్గురు హీరోయిన్లు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్.. ఈ ముగ్గురికీ ఈ సినిమా కెరీర్ పరంగా చాలా కీలకం. జనవరి 9నే థియేటర్లలోకి రానున్న ఈ చిత్రంతో పండగ సీజన్‌కు ఎవరు శుభారంభం ఇస్తారో చూడాలి.

ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించడంలో దిట్ట అయిన అనిల్ రావిపూడి, ఈసారి మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ అంటూ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. వీరిద్దరి కాంబో స్క్రీన్‌పై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.మీనాక్షి చౌదరికి సంక్రాంతి సెంటిమెంట్ బాగానే కలిసొచ్చినట్టుంది.

గతంలో ‘గుంటూరు కారం’(యావరేజ్), ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలతో ఆడియన్స్ ని అలరించింది. వచ్చే ఏడాది నవీన్ పొలిశెట్టి సరసన ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది.శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారీ’ చిత్రంతో సంక్రాంతి బరిలో దిగే అవకాశాలున్నాయి. ఇందులో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా సందడి చేయబోతున్నారు.

మరోవైపు, మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల కాంబోలో రానున్న సినిమాలో ఆషికా రంగనాథ్‌తో పాటు మరో హీరోయిన్ కూడా సంక్రాంతికి పలకరించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.కానీ ఆ సినిమా ప్రస్తుతం హోల్డ్ లో పడినట్టు కూడా అంతా చెబుతున్నారు.ఇక డబ్బింగ్ చిత్రాలు కూడా పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ‘జననాయగన్’తో పూజా హెగ్డే, మమితా బైజు, ‘కరుప్పు’తో త్రిష, ‘పరాశక్తి’తో శ్రీలీల కూడా 2026 సంక్రాంతి బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. మరి ఏ హీరోయిన్ మంచి మార్కులు కొడుతుందో చూడాలి.

ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus