తెలుగు తమిళ భాషలలో ఎన్నో సినిమాలలో కమెడియన్ పాత్రలలో నటించి ఎంతో మంది ప్రేక్షక అభిమానులను సొంతం చేసుకున్నటువంటి కమెడియన్ మనోభాల మరణించిన విషయం మనకు తెలిసిందే. ఈయన తన సినీ కెరియర్లో సుమారు 400కు పైగా సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. అయితే తాజాగా ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారని తెలియజేయడంతో పెద్ద ఎత్తున కోలీవుడ్ సెలబ్రిటీ లందరూ కూడా ఈయన చివరి చూపు కోసం తరలి వెళ్లారు.
ఎప్పుడు ఎంతో చలాకీగా ఉండే మనోభాల ఇలా అనారోగ్యంతో మరణించడానికి ఆయనకు ఉన్నటువంటి చెడ్డ వ్యసనాలే కారణమని తెలుస్తుంది.కేవలం ఈ వ్యసనాల వల్ల ఆయన మరణించారని అయితే తాను మరణిస్తాననే విషయం తనకు ముందుగానే తెలుసు అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈయన తనకు ఉన్నటువంటి చెడు వ్యసనం గురించి తెలియజేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా ఒక రోజుకు ఒక వ్యక్తి దాదాపు పది నుంచి 15 వరకు సిగరెట్లు తాగితే అప్పటికే ఆయన ఆరోగ్యం పాడవుతుందని చాలామంది చెబుతుంటారు కానీ మనోభాల మాత్రం రోజుకి 100 నుంచి 200 వరకు సిగరెట్లు తాగుతానని చెప్పుకొచ్చారు.ఇలా ఎక్కువగా సిగరెట్లు తాగటం వల్ల తన ఊపిరితిత్తులు కాలేయం దెబ్బతిన్నాయని గతంలో వైద్యులు వెల్లడించారు. అయితే ఇలా సిగరెట్లు ఎక్కువగా తాగటం వల్ల తాను మరణించే అవకాశాలు ఉన్నాయని వైద్యులు ముందుగానే చెప్పారని తెలిపారు.
ఇలా తాను (Manobala) చనిపోతానని తెలిసినప్పటికీ ఈయన మాత్రం ఆ వ్యసనాన్ని మానుకోలేకపోయారని ఈయన సంపాదించినది మొత్తం సిగరెట్లు తాగడానికి అనారోగ్యానికి గురైతే హాస్పిటల్ లో చూయించుకోవడానికి సరిపోయిందని వెల్లడించారు. అయితే ఈ ఏడాది జనవరి నుంచి ఈయన ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా మారింది. అప్పటినుంచి ఈయన ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటూ బుధవారం తుది శ్వాస విడిచారు.
ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!
బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా