హీరోని అభిమానించడం అనేది మన సౌత్ లో చాలా పీక్ స్టేజ్ లో ఉంటుంది అనడంలో సందేహం లేదు. అబ్బాయిలు అయితే తమ హీరో సినిమా బాగున్నా… బాగోక పోయినా రిలీజ్ రోజునే 3 లేదా 4 సార్లు చూసేస్తారు. తమ అభిమాన హీరోని ఎవరైనా కామెంట్ చేస్తే తట్టుకోలేరు. అలాంటి ఫ్యాన్ వార్స్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక లేడీ ఫ్యాన్స్ అయితే… వారు ఇష్టపడే హీరో గురించి ఎక్కువగా తెలుసుకుంటారు. అంటే వారి పర్సనల్ లైఫ్ గురించనమాట. వారు అభిమానించే హీరోనే పెళ్లి చేసుకోవాలి అనే రేంజ్లో ఫిక్స్ అయిపోతారు.
ఒకవేళ వారు అభిమానించే హీరోకి పెళ్ళి అయిపోతే మాత్రం. అలా ఉన్న కుర్రాడినే చూసి పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. అయితే స్టార్ హీరో విజయ్ ను అభిమానించే సంగీత ఏకంగా విజయ్ నే పెళ్లి చేసేసుకుంది. విజయ్ అప్పుడప్పుడే స్టార్ గా ఎదుగుతున్న రోజుల్లో అతన్ని కలవడానికి లండన్ లో స్థిరపడిన సంగీత అనే అమ్మాయి కలవడానికి వచ్చింది.
ఈమెను కలిసిన విజయ్ ‘నన్ను కలవడానికి లండన్ నుండీ వచ్చారా’ అంటూ ఆశ్చర్యపోయి ఆమెను తన ఇంటికి తీసుకువెళ్ళి… తన తల్లిదండ్రులకు పరిచయం చేసాడు విజయ్. ఆమె కోసం భోజన ఏర్పాట్లు కూడా చేయించాడు. అటు తరువాత 3 గంటల వరకూ మాట్లాడుకున్నారు. తరువాత 3 ఏళ్లకు తన తల్లిదండ్రులను తీసుకువచ్చింది. తరువాత 3 ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు.వీరికి ఓ పాప, బాబు ఉన్నారు.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
Most Recommended Video
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!