బాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు నానా పటేకర్ ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన స్టార్ నటుడు. తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా, ఇక్కడి ప్రేక్షకులు కూడా అతని నటనని ప్రశంసిస్తూ ఉంటారు. అలాంటి స్టార్ చనిపోవడంతో యావత్ సినీ ప్రేక్షకులు, సినీ నటులు సంతాపం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెట్టారు. కానీ సీనియర్ హీరోయిన్ తను శ్రీ దత్తా(Tanushree Dutta) మాత్రం శాపనార్దాలు పెడుతూ సంచలన వ్యాఖ్యలు చేయడం అందరినీ షాక్ కి గురిచేసింది.
75 ఏళ్ల నానా పటేకర్ అక్టోబర్ 8న గోవాలో ఉన్న తన నివాసంలో గుండెపోటుతో మరణించడం జరిగింది. వైద్యులు దాదాపు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినా లాభం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే.. నానా పటేకర్ మరణ వార్తపై సీనియర్ హీరోయిన్ తనుశ్రీ దత్తా పరోక్షంగా స్పందిస్తూ ఒక వీడియోను వదిలింది. అందులో ఆమె మాట్లాడుతూ.. ” నేను ఓ ముఖ్యమైన కార్యక్రమం కోసం లక్నో వెళ్తున్న సమయంలో ఈ వార్త విన్నాను. దానికి ఎలా స్పందించాలో నాకు అర్థం కాలేదు. కానీ ‘ఈవిల్ డెడ్’ ” అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
తను శ్రీ దత్తా వ్యాఖ్యలకి గాను తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ‘మనిషి చనిపోయాక కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఏంటి?” అంటూ ఆమెపై మండిపడ్డారు. అయినా ఆమె తగ్గలేదు. “అతను నన్ను క్షమాపణ అడగలేదు.. నేనెందుకు మన్నించాలి? నానా పటేకర్ నరకంలో కాలాలి, 18 ఏళ్లుగా నా జీవితాన్ని నరకప్రాయం చేశాడు. పై లోకంలో అతను ఘోరమైన బాధలు, హింస అనుభవించాలి” అంటూ తను శ్రీ దత్తా బదులివ్వడం జరిగింది.
2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్’ అనే సినిమా షూటింగ్ టైమ్లో నానా పటేకర్.. తనుశ్రీ దత్తాని లైంగికంగా వేధించాడట. ఈ విషయాన్ని ఆమె 10 ఏళ్ల తర్వాత అంటే 2018లో ‘మీటూ’ పేరుతో బయటపెట్టింది. నానా పటేకర్ పై కేసు కూడా వేసింది. కానీ తగిన ఆదారాలు లేని కారణంగా ఆ కేసుని కోర్టు కొట్టేసింది. అందుకే తను శ్రీ దత్తా నానా పటేకర్ మరణించినా నెగిటివ్ కామెంట్స్ చేయడం జరిగింది.