రవితేజ చిత్రంలో ఆమె బోల్డ్ క్యారెక్టర్ హైలెట్ అంట..!

  • August 2, 2019 / 05:32 PM IST

‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ ఫేమ్ వి ఐ ఆనంద్ డైరెక్షన్లో మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం “డిస్కోరాజా”. ఈ చిత్రంలో ర‌వితేజ సరసన లీడ్ హీరోయిన్ గా నభా నటేష్, సెకండ్ హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. వీరితో పాటు ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ‘పేపర్ బాయ్’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన తాన్యా హోప్‌ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మధ్యే ఆమెకు సంబందించిన సన్నివేశాల్ని చిత్రీకరించారు. తాన్యా హోప్‌ పాత్ర కాస్త బోల్డ్ గా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

ఈమె పై ఓ మసాలా సాంగ్ కూడా ఉందట. సినిమాలో అదే హైలెట్ గా ఉంటుందని సమాచారం. ఇప్పటికే తన గ్లామ‌ర్ తో యూత్ ని అలరించిన తాన్యా. అవకాశాలు మాత్రం ఎక్కువగా అందుకోలేకపోతుంది. మరి ‘డిస్కోరాజా’ చిత్రంతోనైనా తాన్యా కి మరిన్ని ఆఫర్లు వస్తాయేమో చూడాలి. రవితేజ తో ‘నెల టికెట్’ చిత్రాన్ని నిర్మించిన రామ్ తాళ్ళూరి.. ‘ఎస్.ఆర్.టి’ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాడు. వెన్నెల కిశోర్ కామెడీ ఈ చిత్రంలో హైలెట్ గా ఉండబోతుందని తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus