తపు చేసినవాళ్ళు “తప్పించుకోలేరు” అంటున్న ఆర్.వి.జి

ఆర్.వి.జి మూవీజ్- ఎస్.వి.ఎల్.ఇంట్రప్రైజస్ పతాకాలపై రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి)-తలారి వినోద్ కుమార్ ముదిరాజ్- శ్రీనివాస్ మామిడాల-లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ “తప్పించుకోలేరు”. “కొత్తకథ, ఉసురు, అయ్యప్ప కటాక్షం” వంటి చిత్రాలతో దర్శకుడిగా తన సత్తాను ఘనంగా చాటుకున్న రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) తాజాగా రూపొందించిన ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ముగించుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఆదర్శ్, హరీష్, ట్వింకిల్ అగర్వాల్, సాయి శ్వేత, ఆకెళ్ల, ఫహీం ముఖ్య తారాగణం.

చిత్ర నిర్మాతల్లో ఒకరైన తలారి వినోద్ కుమార్ ముదిరాజ్ మాట్లాడుతూ…”తప్పించుకోలేరు” చిత్రంతో నిర్మాతగా మారుతుండడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం విడుదలయ్యాక మా దర్శకుడు ‘ఆర్.వి.జి’ పేరు మారుమ్రోగుతుంది. సినిమా అంత బాగా వచ్చింది. వి.ఎస్.పి.తెన్నేటి గారి మాటలు-పాటలు, రాజేష్ మ్యూజిక్.. ఈ చిత్రానికి ప్రధానాకర్షణలుగా నిలుస్తాయి. ‘తప్పించుకోలేరు’ నిర్మాణంతో అంత తృప్తిగా ఉండడం వల్లే… ఈ చిత్రం విడుదల కాకుండానే- ఉగాది సందర్భంగా మా ఆర్.వి.జి దర్శకత్వంలో మరో సినిమాకు కూడా శ్రీకారం చుట్టాం” అన్నారు.

ఏ.వి.ఎల్.నరసింహం, నిట్టల, మల్లాది భాస్కర్, మేజర్ ఆర్.వి.సుబ్బారావు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచనా సహకారం: వి.ఆర్.కంచి, ఛాయాగ్రహణం: ప్రసాద్ కె.నాయుడు, సంగీతం: రాజేష్ రాజ్.టి, మాటలు-పాటలు: వి.ఎస్.పి.తెన్నేటి, నిర్మాతలు: రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి)-తలారి వినోద్ కుమార్ ముదిరాజ్-శ్రీనివాస్ మామిడాల-లలిత్ కుమార్, రచన-దర్శకత్వం: రుద్రాపట్ల వేణుగోపాల్(ఆర్.వి.జి)!!

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus