రామ్ చరణ్ – బోయపాటి సినిమాలో తారకరత్న

హీరోగా ఒకేరోజు 9 సినిమాలు మొదలెట్టి తెలుగు చిత్రసీమలో సరికొత్త ట్రెండ్ సృష్టించిన నందమూరి నటవారసుడు తారకరత్న కథానాయకుడిగా హిట్ అవ్వలేకపోయినా విలన్ గా మాత్రం పర్వాలేదనిపించుకొన్నాడు. అందుకే “అమరావతి” సినిమాతో బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ కూడా అందుకొన్నాడు. అందుకే ఆ తర్వాత కూడా కొన్ని చిత్రాల్లో విలన్ గా అడిగారు. అయితే తారకరత్న మాత్రం హీరో నటించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో వేరే దర్శకనిర్మాతలు అతడ్ని తమ సినిమాల్లో విలన్ గా తీసుకొందామన్న ఆలోచనను పక్కనపెట్టేశారు. అయితే.. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత తారకరత్న తానే స్వయంగా విలన్ రోల్స్ చేయడానికి సిద్ధమని చెప్పడంతో మళ్ళీ అతడికి అవకాశాలు వస్తున్నాయి.

తన సినిమాల్లో హీరోలను మాత్రమే కాక విలన్స్ ను కూడా అదే స్థాయిలో చూపించే బోయపాటి శ్రీను తాను తాజాగా రామ్ చరణ్ హీరోగా తెరకెక్కించనున్న చిత్రం కోసం తారకరత్నను ప్రతినాయకుడిగా ఎంపిక చేశారట. ఈ విషయానికి సంబంధించి ఇంకా కన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ.. మెగా హీరో సినిమాలో విలన్ గా నందమూరి కథానాయకుడు నటించడం అనేది ఆసక్తికరమైన అంశం కానుంది.
ఈ చిత్రంలో కథానాయికగా రకుల్ ఫైనల్ అయ్యిందని చెబుతున్నప్పటికీ.. దానయ్య మాత్రం ఆల్రెడీ తమ బ్యానర్ లో “భరత్ అనే నేను” చిత్రంలో కథానాయికగా నటిస్తున్న కైరా అద్వానీ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus