1996లో వచ్చిన “టార్జాన్: ది ఎపిక్ అడ్వెంచర్స్” సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సినిమాలో నటించిన జోయి లారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. అయితే శనివారం అతను ఘోర విమాన ప్రమాదంలో అతను ప్రాణాలు కోల్పోవడం సినీ లోకాన్ని షాక్ కు గురి చేసింది. ఒక సరస్సు లో వారు ప్రయాణం చేస్తున్న చిన్న విమానం కూలిపోపవడంతో అతనితో పాటు మరికొందరు ప్రయాణికులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంలో లారా భార్య, అలాగే మరొక ప్రముఖ రైటర్, డైట్ ప్రోగ్రామ్ వ్యవస్థాపకుడు గ్వెన్ లారా కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వివరణ ఇచ్చారు. సెస్నా సి 501 అనే చిన్న విమానం, స్మిర్నా, టెన్ సమీపంలోని పెర్సీ ప్రీస్ట్ సరస్సులో కూలిపోయింది. శనివారం ఉదయం 11 గంటలకు బయలుదేరిన తరువాత, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అసోసియేటెడ్ మీడియాకు ఒక ప్రకటన ద్వారా తెలిపింది. లారా మృతిపట్ల ప్రపంచవ్యాప్తంగా అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
1989లో సిబిఎస్ టెలివిజన్ చలన చిత్రం “టార్జాన్ ఇన్ మాన్హాటన్” ద్వారా టార్జాన్ గా ప్రపంచానికి పరిచయమైన లారా ఆ పాత్రను 1997 స్పిన్-ఆఫ్ సిరీస్ “టార్జాన్: ది ఎపిక్ అడ్వెంచర్స్” వరకు కొనసాగించాడు. టార్జాన్ అనగానే గుర్తొచ్చేది అందరికి అతని పేరు. అలాగే పలు యాక్షన్ సినిమాలతో కూడా అతను మంచి క్రేజ్ అందుకున్నాడు.