CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

Advertisement

రైల్వే టికెట్‌ బుకింగ్‌లో తత్కాల్‌ విధానం ఉన్నట్లే సెన్సార్‌ సర్టిఫికెట్‌ విషయంలోనూ ఉందని మీకు తెలుసా? దీన్ని పెద్ద హీరోల సినిమాలు, పెద్ద నిర్మాణ సంస్థల సినిమాలు ఎక్కువగా వాడుకుంటుంటాయి. తెలుగులో పెద్ద హీరోల సినిమాల సెన్సార్‌ ఈ ఆప్షన్‌ ద్వారానే అవుతాయి. అయితే ఇప్పుడు సినిమా సెన్సార్ విధానంలో మార్పులు చేయడంతో తత్కాల్‌ ఆగిపోయింది. ఈ నెల 1 నుండి ఈ ఆప్షన్‌ను నిలిపేస్తూ కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితమే నిర్ణయం తీసుకుంది. ఈ నెల 1 నుండి తత్కాల్‌ సేవలు అధికారికంగా నిలిపేశారు.

CBFC

తత్కాల్‌ రైల్వే టికెట్ల తరహాలోనే తత్కాల్‌ సెన్సార్‌ ఆప్షన్‌ పని చేస్తుందన్నమాట. ఈ విధానం ద్వారా సెన్సార్‌ బోర్డును సంప్రదిస్తే ప్రాధాన్యమిస్తూ ఉంటారు. దీనికి అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది కూడా. ఆఖరి నిమిషం అర్జెన్సీలు మన సినిమా పరిశ్రమలో ఎక్కువ. అందుకే ఇన్నాళ్లూ ఇది పాపులర్‌. కానీ ఇప్పుడు ఆ ఆప్షన్‌ లేనట్లే. ఎందుకంటే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఆ తర్వాత సెన్సార్ బృందానికి సినిమాను పంపిస్తున్నారు టాలీవుడ్‌లో.

దీంతో సెన్సార్‌ అవ్వలేదు కాబట్టి సినిమా టైమ్‌కి రావడం లేదు అనే మాట వినిపించలేదు. సెన్సార్ సర్టిఫికెట్ లేకుండా సినిమా రిలీజ్‌ డేట్ ప్రకటించకూడదు అనే నిబంధన ఉంది. కానీ దానిని ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఇప్పుడు సీరియస్‌గా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తత్కాల్‌ లేదు కాబట్టి. 2024లో ఈ తత్కాల్‌ విధానం తీసుకొచ్చారు. రిలీజ్ డేట్‌కి ఐదు రోజుల ముందు స్లాట్ పొందే అవకాశం దొరికింది.

ఈ విధానంలో సెన్సార్‌కు వస్తున్న సినిమాల సంఖ్య ఎక్కువ అవ్వడంతో రెగ్యులర్‌ ఫ్లోలో వచ్చే అంటే రూల్స్‌ ప్రకారం ముందుగా అప్లై చేసుకున్న వాళ్ల సినిమాలు ఎక్కువ రోజులు వెయిటింగ్‌లో ఉంటున్నాయి. అందుకే తత్కాల్ విధానం ఆపేయాలని కేంద్రం భావించింది. దీనిపై నిర్మాతలు, దర్శకుల అభిప్రాయాలను సేకరించింది. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags