యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఈ సినిమా మూడో షెడ్యూల్ షూట్ జరుగుతోంది. తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు టీడీపీ పిలుపు దక్కడం గమనార్హం. హైదరాబాద్ లో ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరగనున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కూడా అదే రోజు కావడం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ కు ఈ ఈవెంట్ కు సంబంధించి ఆహ్వానం అందడం గమనార్హం. నందమూరి కళ్యాణ్ రామ్, ఇతర కుటుంబ సభ్యులకు కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి ఆహ్వానం అందింది. సావనీర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్, నందమూరి రామకృష్ణ కలిసి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను ఆహ్వానించడం జరిగింది.
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కు అన్ని రాజకీయ పార్టీల నేతలు దగ్గరవుతున్నారు. ఎన్టీఆర్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండగా ఎన్టీఆర్ పొలిటికల్ గా కూడా ఎదగాల్సిన అవసరం ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ యాక్టివ్ అయితే ఆ పార్టీకి కూడా ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మరోవైపు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీకి సంబంధించి అప్ డేట్స్ రావాల్సి ఉంది.
ఈ ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ 100 కోట్ల పారితోషికం తీసుకునే స్థాయిక్ ఎదిగిన సంగతి తెలిసిందే. తారక్ స్థాయికి నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్స్ లో సైతం తారక్ అద్భుతంగా నటిస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్ లో తారక్ రేంజ్ పెరుగుతోందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.