రంగస్థలంలో సమంత క్యారక్టర్ తెలిపే టీజర్ సిద్ధం

అపజయాలు పలకరించినా సుకుమార్ ప్రయోగాలు చేయడం ఆపడం లేదు. తన తాజా ప్రాజక్ట్ కి పాతికేళ్ల క్రితం నటి కథను తీసుకొని సాహసం చేసిన డైరక్టర్.. హీరో, హీరోయిన్స్ కి లోపం పెట్టి పెద్ద ప్రయోగమే చేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ చెవిటి వాడిగా నటిస్తున్నట్లు టీజర్ చెప్పకనే చెప్పింది. సౌండ్ ఇంజినీర్ చిట్టి బాబుగా చరణ్ మాత్రం వందశాతం మార్కులు కొట్టేశారు. ఇక సమంత వంతు. ఈమె మూగదానిగా కనిపించనున్నట్టు సమాచారం. చిత్ర బృందం అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ సమంత రోల్ అదేనని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఆ పాత్రలో ఎలా అలరిస్తుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

అభిమానుల కోసం సమంత స్పెషల్ టీజర్ ని చిత్ర బృందం రెడీ చేస్తోంది. త్వరలోనే ఆ టీజర్ రిలీజ్ చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. చరణ్, పూజా హెగ్డే లపై ఓ మాస్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో షూటింగ్ మొత్తం పూర్తి అయినట్లే. జగపతి బాబు, ఆది, అనసూయ తదితరులు ప్రత్యేక పాత్రలు పోషించిన ఈ మూవీ మార్చి 30 న రిలీజ్ కానుంది. రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమా సంచలనం సృష్టిస్తుందని మెగా అభిమానులు అంచనా వేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus