కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అవసరం లేదు… ఏ సినిమాలో ఈ డైలాగ్ ఉందో మీకు తెలిసే ఉంటుంది. అయితే దాన్ని ఇంకాస్త సినిమాలకు అన్వయించి చెబితే ‘కంటెంట్ ఉన్న సినిమాకు ఎన్ని అడ్డంకులు వచ్చినా హిట్ కొట్టి అంతెత్తున కూర్చుంటుంది’ అని అనొచ్చు. తాజాగా ఇలాంటి పరిస్థితులు చూసి, భారీ విజయం అందుకున్న చిత్రం ‘హను – మాన్’. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమిది. అయితే ఈ సినిమా విజయానికి సింపతీ ఓ కారణమని కొంతమంది అంటున్నారు.
తాజాగా ఈ రూమర్లపై హీరో తేజ స్పందించాడు. ఈ సినిమాకు ఇంత హైప్ రావడానికి ‘థియేటర్ల దొరకడం లేదు అనే సింపతీ కారణం’ అని అంటున్నారు దాని మీరేమంటారు అని అడిగితే… మేం ఇప్పటివరకు ఆ కోణంలో ఎక్కడా మాట్లాడింది లేదు. ఒకవేళ అదే నిజమైతే మిగతా భాషల్లో మంచి ఓపెనింగ్స్ రావడానికి కారణమేంటి?. మా విజయం సింపతీతో వచ్చింది కాదు. కష్టపడి పని చేసి, ఫలితం ప్రజల చేతుల్లో పెడితే వచ్చింది అని అన్నారు.
సినిమాకు విడుదలకు పది రోజుల ముందువరకు ఎలాంటి ఒత్తిడి పడలేదని చెప్పిన (Teja Sajja) తేజ.. ఆ తర్వాత థియేటర్ల విషయంలో ఆందోళన కలిగింది అని చెప్పారు. ఆ విషయంలో ఆరంభంలో కొంత ఇబ్బందిగా అనిపించినా.. ఆ దైవశక్తే మా వెనకుండి మమల్ని నడిపిస్తున్నట్లు అనిపించిందన్నారు. ఆ హనుమంతుల వారు సముద్రం దాటినట్లు… మేము అడ్డంకులు దాటుకొని సాఫీగా థియేటర్లలోకి వచ్చేశాం. ఇప్పుడు విజయాన్ని అందరూ ఆస్వాదిస్తున్నాం అని చెప్పారు తేజ.
సుమారు రూ. 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం తొలి రోజే రూ. 21 కోట్లు వసూలు చేసిందని టీమ్ చెబుతోంది. ఇటీవల కాలంలో ఇంతటి పెద్ద విజయం ఏ సినిమాకూ రాలేదు అని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. పొంగల్ హాలీడేస్ అయ్యేలోపు సినిమాకు అతి భారీ విజయం పక్కా అంటున్నారు. పైన చెప్పిన కంటెంట్ డైలాగ్ ఈ సినిమాకు బాగా వర్కవుట్ అయ్యింది కదా.
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!