Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

Advertisement

అప్ కమింగ్ ఫిలిం మేకర్స్ కోసం స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil raju)… ‘దిల్ రాజు డ్రీమ్స్’ ని ఏర్పాటు చేశారు. దీని లాంచ్ లో భాగంగా ఆయన ఇండస్ట్రీలో ఎలాంటి మోసాలు జరుగుతాయో చెప్పి షాకిచ్చారు. ఆయన మాట్లాడుతూ… “సినిమా ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా మోసాలు ఉంటాయి. నిర్మాతలు కావాలనుకునే వారికి రూ.2 కోట్లలో సినిమా చేస్తాం అంటారు.

Dil raju

సినిమా మొదలు పెట్టడానికి వాళ్ళు అలా చెబుతారు. కానీ అది పూర్తయ్యేసరికి రూ.4 కోట్లు అవుతుంది. అప్పుడు ఏమి చేయలేము. అప్పు చేసి తెచ్చి రిస్క్ లో పడిపోతారు. నిర్మాతలు కావాలనుకునే వారికి ‘దిల్ రాజు (Dil raju) డ్రీమ్స్’ లో ట్రైనింగ్ ఇస్తాము. ఏ సినిమాకి ఎంత మార్కెట్ అవుతుంది. ఎంత బడ్జెట్ పెట్టాలి వంటి వాటిపై అందరికీ అవగాహన కల్పిస్తాం” అంటూ చెప్పారు.

అలాగే దిల్ రాజు (Dil raju) మరింతగా మాట్లాడుతూ.. “అలాగే గతంలో దిల్ రాజు శిరీష్- లక్ష్మణ్..లను తీసుకుని ఒక సినిమా డిస్ట్రిబ్యూషన్ కోసం డబ్బులు కట్టడానికి వెళ్తే.. ‘అక్కడ మీరు బాగున్నారు. యాక్టింగ్ చేస్తారా?’ అని అడిగారు. అందుకు ఆశ్చర్యపోయి, సంతోష పడి ఓకే అనుకున్నాం. తర్వాత మేము షూటింగ్ కి వెళితే మా బ్యానర్లు పెట్టి వెల్కమ్ చెప్పారు.

కానీ షూటింగ్లో రోజంతా ఉంచి ఒక అమ్మాయితో గంట కొట్టించే సీన్ తీశారు.మమ్మల్ని వాళ్ళు బురిడీ కొట్టించడానికి అలా చేశారని గ్రహించి ‘మాకు సినిమా కంప్లీట్ చేసి ఇవ్వండి.. యాక్టింగ్ వద్దు’ అని చెప్పి వచ్చేశాం” అంటూ చెప్పాడు. ఇలా మనల్ని బురిడీ కొట్టించే జనాలు ఎక్కువగానే ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి” అంటూ చెప్పారు. దిల్ రాజు (Dil raju) కామెంట్స్ తో అతని భార్య తేజస్విని పడి పడి నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus