ధనుష్ (Dhanush)- నాగార్జున (Nagarjuna) కాంబినేషన్లో ‘కుబేర’ (Kuberaa) వచ్చింది. జూన్ 20న రిలీజ్ అయిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ‘ఏషియన్ సినిమాస్’ ‘అమిగోస్ క్రియేషన్స్’ సంస్థలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్, శేఖర్ కమ్ముల (Sekhar Kammula) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి వారం పూర్తయ్యింది.
వీకెండ్ వరకు బాగా క్యాష్ చేసుకున్న ఈ సినిమా… వీకెండ్ తర్వాత స్లో అయ్యింది. ఎ సెంటర్స్ లో డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్నా… బి, సి సెంటర్స్ లో తగ్గాయి. అయినప్పటికీ 8 రోజుల్లో ‘కుబేర’ బ్రేక్ ఈవెన్ సాధించింది. ‘కన్నప్ప’ (Kannappa) లాంటి సినిమా పోటీగా ఉన్నా ‘కుబేర’ కి జనం బాగానే వెళ్తున్నారు. ఒకసారి 9 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 13.97 cr |
సీడెడ్ | 4.07 cr |
ఉత్తరాంధ్ర | 5.01 cr |
ఈస్ట్ | 2.37 cr |
వెస్ట్ | 1.43 cr |
గుంటూరు | 1.97 cr |
కృష్ణా | 2.12 cr |
నెల్లూరు | 1.10 cr |
ఏపీ+తెలంగాణ | 32.04 cr (షేర్) |
తమిళనాడు | 10.07 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 6.18 cr |
ఓవర్సీస్ | 16 cr |
వరల్డ్ టోటల్ | 64.29 cr (షేర్) |
‘కుబేర’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.58.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.60 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 8 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా 9వ రోజుకు రూ.64.29 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.110 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.4.29 కోట్ల ప్రాఫిట్స్ ను బయ్యర్స్ కి అందించింది.10 వ రోజు కూడా భారీగా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.