ధనుష్ హీరోగా ‘సార్’ అనే ద్విభాషా చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 17న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దానికి ధనుష్ వచ్చి తన సినిమాను ప్రమోట్ చేశాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ధనుష్ చాలా గొప్పగా మాట్లాడాడు అనే చెప్పాలి. ‘2002 లో నా మొదటి సినిమా విడుదలైంది. ఇప్పుడు 2023 లో నా మొదటి తెలుగు సినిమా విడుదలవుతోంది. అప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో.. ఇప్పుడు కూడా నాకు అలాంటి ఫీలింగే కలుగుతుంది. మధ్యలో వేరే భాషల్లో సినిమాలు చేశాను.
ప్రతీది కూడా నా మొదటి సినిమాలనే ఫీలయ్యి చేశాను’ అంటూ చాలా బాగా మాట్లాడాడు ధనుష్. పైగా ‘మాష్టారు’ అనే పాటని తెలుగులో చాలా చక్కగా పాడాడు. అతని పద్ధతి చూస్తే నిజంగా ముచ్చటేస్తుంది అన్నా కూడా అతిశయోక్తి లేదు. తెలుగులో అతని మార్కెట్ అంతంత మాత్రమే అని కూడా ధనుష్ కు తెలుసు. అయినా కూడా హైదరాబాద్ వచ్చి మరీ తన సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. ఇందుకే మరో తమిళ స్టార్ హీరో విజయ్ ను ట్రోల్ చేస్తున్నారు తెలుగు ప్రేక్షకులు.
విజయ్ తో తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తీసిన ‘వారసుడు’ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాని తెలుగులో ప్రమోట్ చేయడానికి విజయ్ ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు. పైగా దిల్ రాజు వంటి అగ్ర నిర్మాత భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా ఇది. రూ.100 కోట్ల వరకు విజయ్ పారితోషికం తీసుకున్నాడు. అయినా అతను హైదరాబాద్ వచ్చి ప్రమోట్ చేసింది లేదు. విజయ్ కి తెలుగులో రూ.15 కోట్ల వరకు మార్కెట్ ఉంది. ‘వారసుడు’ ని కనుక ప్రమోట్ చేసి ఉంటే ఇంకా బాగా కలెక్ట్ చేసేడేమో. అందుకే ధనుష్ ను చూసి నేర్చుకోమంటూ విజయ్ ని ఏకిపారేస్తున్నారు నెటిజన్లు.
అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!
వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!