ఫస్ట్ డే టాప్ 10 లో ‘ఆర్.ఆర్.ఆర్’.. స్థానం ఎక్కడ?

  • March 26, 2022 / 04:14 PM IST

రికార్డుల విషయంలో ‘బాహుబలి2’ ఓ ట్రెండ్ సెట్ చేసింది. సౌత్ లోనే కాదు… బాలీవుడ్ లో కూడా… ఆ సినిమా రికార్డులను మళ్ళీ రాజమౌళినే తన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంతో కొట్టాలని అంతా ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే మొన్నటి వరకు ‘నాన్ బాహుబలి’ అనే పేరుతో రికార్డులు ఉండేవి.అయితే అంతా అనుకున్నట్టుగానే ‘ఆర్.ఆర్.ఆర్’ మొదటి రోజు ‘బాహుబలి2’ రికార్డులను బ్రేక్ చేసింది. ముందు ముందు సంగతి ఎలా ఉంటుందో తెలీదు కానీ ఇప్పటికైతే ‘ఆర్.ఆర్.ఆర్’ చరిత్ర సృష్టించింది.

ఇది కూడా రాజమౌళి సృష్టించిన అద్భుతమే కాబట్టి ఇక నుండీ నాన్ రాజమౌళి రికార్డులు అని పిలిచినా పిలవచ్చు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి మొదటి రోజు అత్యధిక షేర్ కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఏంటి? అనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :

1) ఆర్.ఆర్.ఆర్:

రాజమౌళి- చరణ్- ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.135.5 కోట్ల షేర్ ను రాబట్టి చరిత్ర సృష్టించింది.

2) బాహుబలి 2:

రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.122.5 కోట్ల షేర్ ను రాబట్టింది.

3) సాహో:

ప్రభాస్ నటించిన ఈ చిత్రం మొదటి రోజు ఈ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.73.58 కోట్ల షేర్ ను రాబట్టింది.

4) బాహుబలి ది బిగినింగ్:

రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.52.8 కోట్ల(అన్ని వెర్షన్లు కలుపుకుని) షేర్ ను రాబట్టింది.

5) సైరా:

మెగాస్టార్ చిరంజీవి- సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.50.11 కోట్ల షేర్ ను రాబట్టింది.

6) సరిలేరు నీకెవ్వరు:

మహేష్ బాబు- అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.42.60 కోట్ల షేర్ ను రాబట్టింది.

7) రాధే శ్యామ్:

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.40.32 కోట్ల షేర్ ను రాబట్టింది.

8) అజ్ఞాతవాసి:

పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటిరోజు వరల్డ్ వైడ్ గా రూ.39.18 కోట్ల షేర్ ను రాబట్టింది.

9) అల వైకుంఠపురములో:

అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.36.83 కోట్ల షేర్ ను రాబట్టింది.

10) పుష్ప:

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.36.72 కోట్ల షేర్ ను రాబట్టింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus