సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి.. హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘తెలుసు కదా’. నీరజ కోన డైరెక్ట్ చేసిన ఈ సినిమా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై కృతి ప్రసాద్, టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిన్నటి నుండి ఈ సినిమా ట్రైలర్ ను నెట్లోకి వదులుతామని మేకర్స్ చెబుతూ వచ్చారు. కానీ ఆలస్యం అయ్యింది. మొత్తానికి కొద్దిసేపటి క్రితం యూట్యూబ్లో వదిలారు.
‘తెలుసు కదా’ ట్రైలర్ విషయానికి వస్తే.. ‘నువ్వు ఏ రోజైతే నీ ఆడదానికెళ్లి నీ కన్నీళ్లు, బాధ చూపిస్తావో.. ఆ రోజు నువ్వే నీ జుట్టు తీసుకెళ్లి దాని చేతిలో పెట్టినోడివి అవుతావ్.. బ్రదర్..ఆ కంట్రోల్ ఎప్పుడూ వాళ్ళకి ఇవ్వొద్దు’ అంటూ హీరో సిద్ధు జొన్నలగడ్డ చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఈ సినిమాలో హీరో ఇద్దరు హీరోయిన్లని ప్రేమిస్తాడు. అది కాదు సమస్య. ఇద్దరితోనూ కలిసి ఉండాలి అనుకుంటాడు. అదే సమస్య…అని ట్రైలర్ తో క్లారిటీ ఇచ్చారు.
అది ఎందుకు? అనే ఆసక్తిని రేకెత్తిస్తూ ట్రైలర్ ను కట్ చేశారు. ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ఈ సినిమా కథలో కీలక భాగం ఫెర్టిలిటీ సెంటర్ల నేపథ్యంలో సాగుతుంది అని తెలుస్తుంది. ఆ టాక్ కి.. ఈ ట్రైలర్ కి సింక్ కనిపిస్తుంది. అయితే ఈ ట్రైలర్ అంతా సిద్ధు గత సినిమా ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ స్టైల్లోనే ఉంది. హీరో ఫ్రెండ్ రోల్ చేసిన హర్ష ‘ ఎవరైనా చెంప మీద కొట్టబోతున్నాను అని ముందుగా చెప్తే నొప్పేమైనా తక్కువేస్తదా? చెంప ఎప్పుడు పగుల్తాదా అనే భయం వేస్తది’ అంటూ పలికిన డైలాగ్ ట్రైలర్ కి హైలెట్ గా నిలిచింది.
తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. అలాగే హీరోయిన్లతో సిద్ధు రొమాన్స్ కూడా హాట్ టాపిక్ అయ్యేలా ఉంది. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :