మరోసారి గరిటె పట్టి వావ్‌ అనిపించిన తల

Advertisement

అజిత్‌ సినిమాలు ఎంత బాగుంటాయో… అతను వండిన బిరియానీ కూడా అంత బాగుంటుంది అంటుంటారు. అజిత్‌ వండిన బిరియానీ కోసం స్ట్రిక్ట్‌గా పాటిస్తున్న డైట్‌ను పక్కన పెట్టేసి ఓ పట్టు పట్టేసిన నటులు చాలామంది ఉన్నారు. తాజాగా అజిత్‌ బిరియానీ కోసం డైట్‌ను పక్కన పెట్టేశాడు మన కార్తికేయ. అజిత్‌ కొత్త సినిమా ‘వాలిమై’లో కార్తికేయ ప్రతినాయక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా పుణె షెడ్యూల్‌ పూర్తయింది. అక్కడే జరిగింది ఈ బిరియానీ ట్రీట్‌.

అజిత్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘వాలిమై’. ఇందులో అజిత్‌ మోటార్‌ స్పోర్ట్స్‌ ప్లేయర్‌గా కనిపిస్తాడని సమాచారం. పుణెలో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో అజిత్‌ స్పెషల్‌ బిరియానీ గురించి కార్తికేయ తెలుసుకుని.. తమ కోసం వండమని కోరాడాట. అతని కోరికను మన్నించి అజిత్‌ చక్కగా బిరియానీ వండి అందరికీ ట్రీట్‌ ఇచ్చాడట. అందరూ ఆ బిరియానీని బాగా ఎంజాయ్‌ చేశారట. అజిత్‌ చేత్తో వండిన బిరియానీ తిని ఫిదా కాని వారు ఎవరూ ఉండరు.

తాజాగా కార్తికేయ కూడా అదే ఫీల్‌ని ఎంజాయ్‌ చేశాడట. మరి అజిత్‌కు ఉన్న ఎక్స్‌ట్రా టాలెంట్‌ ఫొటోగ్రాఫర్‌ను కూడా త్వరలో కార్తికేయకు చూపిస్తాడేమో. అజిత్‌ తీసిన ఫొటోలు మామూలుగా ఉండవనే విషయం తెలిసిందే. మరి అజిత్‌తో కార్తికేయ ఫొటో తీయించుకుంటాడామో చూడాలి. అన్నట్లు ‘వాలిమై’ పూర్తి స్థాయి మాస్‌ మసాలా సినిమాగా రూపొందుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన స్టంట్స్‌ పూర్తయ్యాయి.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus