Thaman: ఎన్బీకే 109 విజువల్ ట్రీట్ అంటున్న థమన్.. అంచనాలు పెంచేస్తూ?

బాలయ్య (Balakrishna) థమన్ (Thaman) కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. బాలయ్య సినిమాలకు థమన్ ఇచ్చిన మ్యూజిక్, బిజీఎం ప్లస్ అయ్యాయే తప్ప ఎప్పుడూ మైనస్ కాలేదు. తెలుగులో వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న థమన్ ఎన్బీకే 109కు కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. బాలయ్య వల్లే థమన్ కు ఈ సినిమాకు పని చేసే ఛాన్స్ వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. ఒక స్టార్ హీరో వరుసగా 4 సినిమాలకు పని చేసే అవకాశం ఇవ్వడం థమన్ విషయంలోనే జరిగిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఎన్బీకే 109 సినిమాకు విజయ్ కార్తీక్ (Vijay Karthik) సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. థమన్ తన ట్వీట్ లో బ్రో .. విజయ్ కార్తీక్.. ఇప్పుడే ఎన్బీకే 109 కొన్ని రషెస్ చూశానని ఎన్బీకే 109 ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అని ఓ మై గాడ్ అంటూ థమన్ కామెంట్లు చేయడం గమనార్హం. ఈ సినిమాలో బాబీ డియోల్ (Bobby Doel) విలన్ రోల్ లో నటిస్తుండగా బాలయ్య బాబీ డియోల్ కాంబో సీన్స్ వేరే లెవెల్ లో ఉండనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య ఈ సినిమాకు బ్రేక్ ఇచ్చారని ఎన్నికల ప్రచారంతో ఆయన బిజీ కానున్నారని సమాచారం అందుతోంది.త్వరలో బాలయ్య మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. బాలయ్య థమన్ ఈ సినిమాతో బాక్సాఫీస్ ను మరోసారి షేక్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య కెరీర్ లో తొలిసారి 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమా గ్లింప్స్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని క్రేజీ అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus