తమన్ ని తలదన్నేందుకు సన్నద్ధమవుతున్న సాయి కార్తీక్!
- March 26, 2016 / 09:58 AM ISTByFilmy Focus
సంగీత దర్శకుడిగా కెరీర్ ను ఆరంభించిన అతి తక్కువ సమయంలో 50 సినిమాలకు స్వరసారధ్యం వహించిన వ్యక్తిగా నిలిచిన తమన్ కు పోటీగా.. అదే స్పీడుతో 50 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి తమన్ తర్వాతి స్థానంలో నిలిచాడు సాయి కార్తీక్.
2008లో సంగీత దర్శకుడిగా కెరీర్ ను ఆరంభించిన సాయి కార్తీక్ తొలుత చిన్న చిన్న సినిమాలకు పనిచేసాడు. ఆ తర్వాత మీడియం రేంజ్ సినిమాలతో తన స్టామినా ప్రూవ్ చేసుకొన్నాడు. సాయి కార్తీక్ స్వరాలు సమకూర్చిన 50వ సినిమా “రాజా చెయ్యి వేస్తే” ఆడియో విడుదల నిన్న విజయవాడలో జరిగింది!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












