Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Itllu Arjuna Review in Telugu: ఇట్లు అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

Itllu Arjuna Review in Telugu: ఇట్లు అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

  • November 13, 2026 / 07:39 AM ISTByFilmy Focus Desk
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Itllu Arjuna Review in Telugu: ఇట్లు అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • అనీష్‌ (Hero)
  • అన‌స్వ‌ర రాజ‌న్‌ (Heroine)
  • బ్రహ్మాజీ, ముఖేష్ రుషి, గెటప్ శీను, రఘుబాబు, మైమ్ గోపి , వెన్నెల‌కిషోర్ త‌దిత‌రులు (Cast)
  • మ‌హేష్ ఉప్ప‌ల‌ (Director)
  • వెంకీ కుడుముల‌ (Producer)
  • త‌మ‌న్‌ (Music)
  • రాజా మహదేవన్ (Cinematography)
  • కే .కోటి (Editor)
  • Release Date : 13th న‌వంబ‌ర్‌ 2026
  • వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ (Banner)

ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌మోష‌న్స్‌తోనే తెలుగు ప్రేక్ష‌కుల్లో “ఇట్లు అర్జున” (Itllu Arjuna) మూవీ ఆస‌క్తిని రేకెత్తించింది. అనీష్ అనే కొత్త హీరో న‌టించిన ఈ సినిమాకు స్టార్ హీరో నాగార్జున ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, అఖిల్‌తో పాటు ప‌లువురు అగ్ర హీరోలు ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన‌డంతో ఈ చిన్న సినిమాపై మంచి బ‌జ్ ఏర్ప‌డింది. ఇట్లు అర్జున సినిమాను ఛ‌లో, భీష్మ సినిమాల ఫేమ్‌ వెంకీ అట్లూరి నిర్మించారు. అన‌స్వ‌ర రాజ‌న్ హీరోయిన్‌గా న‌టించింది. శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైన “ఇట్లు అర్జున” ఎలా ఉంది? తొలి సినిమాతోనే అనీష్ హీరోగా ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడా? లేదా? అన్న‌ది చూద్దాం…

Itllu Arjuna Movie Review

Itllu Arjna Movie Review And Rating

క‌థ‌: పెద్దన్న(ముఖేష్ రుషి) ఓ మాఫియా డాన్. వెయ్యి కోట్ల హవాలా మనీ డీల్ కోసం తన కొడుకు మునిని .. జైసలంపూర్ కి పంపుతాడు. ఆ డీల్ కి సంబంధించిన పెన్ డ్రైవ్, పాస్ వర్డ్ ముని తీసుకుంటుండ‌గా అతని వద్ద నుండి గుర్తు తెలియ‌ని వ్యక్తి వాటిని దొంగిలిస్తాడు. అదే స‌మ‌యంలో మునిని పెద్దన్న అనుచరుడు గౌరీ చంపేస్తాడు. పెన్ డ్రైవ్ కొట్టేసిన వ్యక్తి ఈ హ‌త్య చేశాడ‌ని పెద్ద‌న్న‌ను న‌మ్మిస్తాడు. అనుకోకుండా ఈ గొడ‌వ‌లోకి మూగవాడు అయిన అర్జున్ ఎంట‌ర‌వుతాడు? చిన్న‌ప్ప‌టి నుంచి దొంగ‌త‌నాలు చేస్తూ పెరిగిన అర్జున్ పెద్ద‌న్న అండ్ గ్యాంగ్‌ను ఎదురించి ఎలాంటి పోరాటం సాగించాడు? మాట‌లు రాని అర్జున్ త‌న ప్రేమ‌ను కీర్తికి (అనశ్వర రాజన్) ఎలా చెప్పాడు? త‌న కొడుకు చంపిన వారిని పెద్ద‌న్న క‌నిపెట్టాడా? లేదా? అన్న‌దే ఇట్లు అర్జున మిగిలిన క‌థ‌.

Itllu Arjna Movie Review And Rating

నటీనటుల పనితీరు: అనీష్ ఈ సినిమాతోనే హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొద‌టి సినిమాకే హీరోలంతా తమ టాలెంట్ మొత్తం చూపించాలని తపిస్తుంటారు. పెద్ద బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నప్పుడు డైలాగ్ డెలివరీతో మాస్ ఆడియన్స్ ని మెప్పించాలని ప్రయత్నిస్తుంటారు. కానీ డెబ్యూ మూవీలోనే మూగ‌వాడిగా న‌టించి అనీష్ సాహ‌స‌మే చేశాడు. డైలాగులు లేకుండా కేవ‌లం ఎక్స్‌ప్రెష‌న్స్‌తోనే పాత్రని నడిపించడం అన్న‌ది చిన్న విషయం కాదు. సైన్ లాంగ్వేజ్ తో, విజిల్ తో అతను హీరోయిన్ తో కమ్యూనికేట్ అయ్యే విధానం కొత్త‌గా ఉంది.

అనస్వ‌ర రాజన్ కీర్తి పాత్రలో ఒదిగిపోయింది. గ్లామర్ తోనే కాకుండా నటనతో కూడా ఆకట్టుకుంది. హీరోతో సమానంగా సినిమాలో ఆమె పాత్ర‌కు స్క్రీన్ స్పేస్ ఉండ‌టం గ‌మ‌నార్హం. బ్రహ్మాజీ, ముఖేష్ రుషి, గెటప్ శీను, రఘుబాబు, మైమ్ గోపి వంటి అనుభ‌వ‌జ్ఞులైన స్టార్స్‌ ఈ సినిమాలో ఉన్నారు. వెన్నెల కిషోర్ కామెడీ బాగా పేలింది. అత‌డి పంచ్‌లు హిలేరియ‌స్‌గా న‌వ్విస్తాయి. బ్ర‌హ్మాజీ, గెట‌ప్ శీను ట్రాక్ నుంచి చ‌క్క‌టి ఫ‌న్ జ‌న‌రేట్ అయ్యింది. మలయాళ నటుడు కలైయరసన్ హరికృష్ణన్ విలనిజం బాగుంది. ఎలాంగో కుమారవేల్ కన్నింగ్ విలనిజం కూడా మెప్పిస్తుంది.

Itllu Arjna Movie Review And Rating

సాంకేతిక వర్గం పనితీరు: ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే వెబ్ సిరీస్ తో ఆల్రెడీ దర్శకుడిగా తన ముద్ర వేసుకున్నాడు మహేష్ ఉప్ప‌ల‌. అయితే ఈ మధ్య చాలా మంది యంగ్ డైరెక్టర్స్ ఓటీటీల్లో తమ టాలెంట్ చూపిస్తున్నప్పటికీ థియేట్రిక‌ల్ సినిమాల‌కు వచ్చేసరికి కమర్షియల్ మీటర్స్ గ్రహించక తప్పటడుగులు వేస్తున్నారు. మహేష్ ఉప్పాల మాత్రం ఎక్కడా తడబడకుండా భారీ బ‌డ్జెట్ సినిమాను హ్యాండిల్ చేసిన విధానం మెచ్చుకోదగినదే. ప్రథమార్థం కామెడీ, ల‌వ్ అంశాల‌తో సాఫీగా సాగిపోతుంది. కానీ ద్వితీయార్థానికి వచ్చేసరికి పూర్తిగా యాక్షన్ కొరియోగ్రాఫర్స్ పైనే ఆధారపడిపోయాడు. ఎక్కువ శాతం ఎమోష‌న్స్‌, ల‌వ్ కంటే యాక్షన్ కే పెద్ద పీట వేశాడు.

ఈ సినిమాకు డైరెక్ట‌ర్ వెంకీ కుడుములు ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. డెబ్యూ హీరోని నమ్మి ఇంత భారీ బడ్జెట్ పెట్టడం అంటే చిన్న విషయం కాదు. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ టాప్ నాచ్‌లో ఉన్నాయి. సినిమా క‌థ‌, క‌థ‌నాల్లో చాలా చోట్ల వెంకీ మార్క్ కనిపించింది. స్క్రీన్ ప్లే విషయంలో వెంకీ ఇన్‌వాల్వ్ అయిన‌ట్లుగా ఉన్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఇట్లు అర్జున‌కు మరో హీరో. పాటలతో మాత్రమే కాదు నేపథ్య సంగీతంతో కూడా సినిమా స్థాయిని పెంచాడు తమన్. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది.

Itllu Arjna Movie Review And Rating

విశ్లేషణ: రాబరీ బ్యాక్ డ్రాప్ లో గతంలో తెలుగులో చాలానే సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా హీరో, విలన్ మధ్య క్యాట్ అండ్ మౌస్ థీమ్తో సాగే సినిమాలు ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ల‌తో ఆసక్తికరంగా ఉంటాయి. ‘ఇట్లు అర్జున’ కూడా ఆ కోవకి చెందిన సినిమానే. ఓ వైపు హీరోహీరోయిన్ల ప్రేమ‌క‌థ‌… మ‌రోవైపు పెద్ద‌న్న గ్యాంగ్ అన్వేష‌ణ‌తో ఫ‌స్ట్ హాఫ్ థ్రిల్లింగ్‌గా న‌డిపించారు ద‌ర్శ‌కుడు.ల‌వ్ ట్రాక్ కొత్త‌గా అనిపిస్తుంది. ఇంట‌ర్వెల్ ఎపిసోడ్ వద్ద వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. సెకండాఫ్‌లో స‌స్పెన్స్‌, కామెడీ రెండింటిని డైరెక్ట‌ర్ బ్యాలెన్స్ చేసిన తీరు బాగుంది.

వెయ్యి కోట్లు ఎవ‌రికి ద‌క్కుతాయ‌నే క్యూరియాసిటీ చివ‌రి వ‌ర‌కు మెయింటేన్ చేశాడు. డెబ్యూ హీరోతో ఎక్కువ ఫైట్లు చేయించకుండా అవసరమైన చోట్ల మాత్రమే యాక్షన్ చేయించడం.. ఆ బ్లాక్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేయించడం మేకర్స్ తీసుకున్న తెలివైన నిర్ణయంగా పరిగణించాలి. మొత్తంగా ‘ఇట్లు అర్జున’ ఫక్తు కమర్షియల్ మీటర్‌లో తీసిన యాక్షన్ లవ్ స్టోరీ. అనీష్, అన‌స్వ‌ర యాక్టింగ్‌, వారి కెమిస్ట్రీ కోస‌మైనా థియేట‌ర్‌లో చూడొచ్చు.

Itllu Arjna Movie Review And Rating

ఫోకస్ పాయింట్: కమర్షియల్ హంగులతో సాగే మూగ దొంగ ప్రేమకథ

రేటింగ్‌: 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anaswara Rajan
  • #Aniesh
  • #Mahesh Uppala
  • #thaman
  • #Venky Kudumula

Reviews

Itllu Arjuna Review in Telugu: ఇట్లు అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

Itllu Arjuna Review in Telugu: ఇట్లు అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

GOAT Review in Telugu: గోట్ సినిమా రివ్యూ & రేటింగ్!

GOAT Review in Telugu: గోట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Itllu Arjuna Review in Telugu: ఇట్లు అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

Itllu Arjuna Review in Telugu: ఇట్లు అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Balayya – Koratala: ఈ సారి బాలయ్య సినిమాలో ఆ డప్పులు వినిపించవు.. కొత్త మ్యూజిక్యు రెడీ

Balayya – Koratala: ఈ సారి బాలయ్య సినిమాలో ఆ డప్పులు వినిపించవు.. కొత్త మ్యూజిక్యు రెడీ

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

trending news

Itllu Arjuna Review in Telugu: ఇట్లు అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

Itllu Arjuna Review in Telugu: ఇట్లు అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

7 mins ago
GOAT Review in Telugu: గోట్ సినిమా రివ్యూ & రేటింగ్!

GOAT Review in Telugu: గోట్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Anirudh Wedding: ఘనంగా అనిరుధ్ వివాహం..వైరల్ అవుతున్న ఫోటోలు!

Anirudh Wedding: ఘనంగా అనిరుధ్ వివాహం..వైరల్ అవుతున్న ఫోటోలు!

22 hours ago
Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

1 day ago
Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

1 day ago

latest news

Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

1 day ago
Pawan Kalyan: పవన్ మాత్రమే కాదు ఆ హీరో కూడా విడాకులు తీసుకున్నాడట..కానీ?

Pawan Kalyan: పవన్ మాత్రమే కాదు ఆ హీరో కూడా విడాకులు తీసుకున్నాడట..కానీ?

2 days ago
Jailer 2 Collections: అక్షరాలా రూ.850 కోట్లు.. ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: అక్షరాలా రూ.850 కోట్లు.. ‘జైలర్ 2’ సెన్సేషన్

2 days ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ 10 రోజుల్లో కేవలం 57 శాతం రికవరీ మాత్రమే

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ 10 రోజుల్లో కేవలం 57 శాతం రికవరీ మాత్రమే

2 days ago
Scene Collections: బ్రేక్ ఈవెన్..కి చేరువలో ‘సీన్’.. మామూలు మాస్ కాదిది

Scene Collections: బ్రేక్ ఈవెన్..కి చేరువలో ‘సీన్’.. మామూలు మాస్ కాదిది

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version