Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

మోషన్ పోస్టర్ అనేది ఒకప్పుడు మంచి ట్రెండ్. సినిమా ఫస్ట్ లుక్ లేదా, హీరో ఫస్ట్ లుక్స్ ను మోషన్ పోస్టర్స్ ద్వారా రిలీజ్ చేసేవారు. ఆ తర్వాత టీజర్లు, ట్రైలర్లు, గ్లింప్స్ లు వచ్చాయి. అయితే.. నితిన్ (Nithiin)  తాజా చిత్రం “తమ్ముడు”(Thammudu) ఆ మరిచిపోతున్న మోషన్ మాస్టర్ ట్రెండ్ ను మరోసారి గుర్తుచేయడమే కాదు, ఆ ట్రెండ్ ను సరిగ్గా వినియోగించుకుంది కూడా. సినిమాలోని కీలకపాత్రధారులను ఈ మోషన్ పోస్టర్ ద్వారా పరిచయం చేశాడు దర్శకుడు శ్రీరామ్ వేణు (Venu Sriram) .

Thammudu

సప్తమి గౌడ (Sapthami Gowda) , శ్వాసిక, లయ (Laya) , సౌరభ్ సచ్ దేవా, వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) వంటి పాత్రధారులు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు అనేది రివీల్ చేస్తూ వాళ్ళ క్యారెక్టర్ నేమ్స్ కూడా రివీల్ చేశాడు. అలాగే.. నితిన్ క్యారెక్టర్ బ్యాగ్రౌండ్ ఏంటి, టైటిల్ కి ఆ బ్యాగ్రౌండ్ తో లింక్ ఏంటి అనేది కూడా రివీల్ చేసిన విధానం బాగుంది. ఒక్కో పాత్రకి ఒక్కో పోస్టర్ రిలీజ్ చేస్తూ టైమ్ వేస్ట్ చేయడం కంటే ఇది బెటర్ ప్రొసెస్. ఈ మోషన్ పోస్టర్ తో ఆసక్తి రేకెత్తించడంలో వేణు & నితిన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

అయితే.. “వకీల్ సాబ్”(Vakeel Saab)  లాంటి బ్లాక్ బస్టర్ అనంతరం వేణు శ్రీరామ్ కి, “రాబిన్ హుడ్” (Robinhood) లాంటి డిజాస్టర్ తర్వాత నితిన్ కి “తమ్ముడు” చాలా ఇంపార్టెంట్ సినిమా. ఈ సినిమా రిజల్ట్ మీద చాలా మంది కెరీర్లు ఆధారపడి ఉన్నాయి. మరి రిజల్ట్ ఏమవుతుంది అనేది తెలియాలంటే జులై 4 వరకు వెయిట్ చేయాలి. వేణు శ్రీరామ్ పుట్టినరోజు నుండి ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన చిత్రబృందం.. సినిమా ఆడియన్స్ కి రీచ్ అయ్యేందుకు ఏం చేస్తుందో చూడాలి.

నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus