నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

జనాలు థియేటర్లకు రావడం లేదు అంటూ ఫిలిం మేకర్స్ గోల పెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ.. అది నిలువరించడానికి ప్రయత్నాలు మాత్రం ఎవరూ చేయడం లేదు. “హిట్ 3” (HIT 3) వచ్చే వరకు థియేటర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు సినిమాలు ఆడకపోవడానికి కారణాలుగా ఐపీఎల్, టికెట్ రేట్లు వంటివి చూపిస్తూ వచ్చారు. వీటన్నిటికీ మించిన సమస్య ఓటీటీ (OTT) విండో అని మాత్రం ఒప్పుకోలేకపోతున్నారు. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల్లో సినిమాలో ఓటీటీలో లభ్యమవుతుంది అని ఆడియన్స్ కి క్లారిటీ వచ్చేసాక, ఒక యావరేజ్ లేదా ఎబౌ యావరేజ్ సినిమా చూడడానికి థియేటర్ కి ఎందుకు వస్తారు?.

OTT

ఈ విషయమై చర్చించనివారు లేరు కానీ.. సమాధానం మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. అయితే.. ఆ ఓటీటీ విండో ఇప్పుడు ఏకంగా నాలుగు వారాల నుంచి మూడు వారాలకి పడిపోవడం అనేది మాత్రం ఎవ్వరూ ఊహించని పరిణామం. ఇటీవల “ఓదెల 2” (Odela 2) సరిగ్గా మూడు వారాల్లో అమెజాన్ ప్రైమ్ లో ప్రత్యక్షమై హల్ చల్ చేసింది. మేకర్స్ కూడా తమ సినిమా నెంబర్ 1 పొజిషన్ లో ట్రెండ్ అవుతుంది అని డబ్బా కొట్టుకోవడం తప్ప..

ఇంత త్వరగా ఓటీటీ రిలీజ్ అవ్వడం అనేది ఇండస్ట్రీకి, థియేటర్ వ్యవస్థ, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థకి ఎంత చేటు అనేది మాత్రం గ్రహించడం లేదు. ఇప్పుడు “అర్జున్ సన్నాఫ్ వైజయంతి” (Arjun S/O Vyjayanthi) పరిస్థితి కూడా ఇంచుమించు అంతే. డైరెక్ట్ గా స్ట్రీమ్ అవ్వకుండా.. కొన్ని దేశాల్లో రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉంచారు. మహా అయితే మరో వారంలో అందరికీ అందుబాటులోకి తీసుకొస్తారు. మరి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లేదా ఫిలిం ఛాంబర్ లు ఈ ఓటీటీ విండోపై ఎలాంటి చర్యలు తీసుకుంటాయో చూడాలి. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే మాత్రం ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ఉండేవారు అని చెప్పుకోవాల్సి వస్తుంది.

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus