Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్ భాస్కర్.. ఆ డైరక్టర్ని రీప్లేస్ చేస్తూ..
- October 24, 2026 / 06:22 PM ISTByFilmy Focus Desk
తరుణ్ భాస్కర్.. ‘పెళ్లి చూపులు’ సినిమా తర్వాత ఒక్కసారిగా అందరూ చూపు ఆయనవైపు తిప్పుకున్నారు. సగటు సినిమా దర్శకుడు అనే ట్యాగ్ తనకు ఏ మాత్రం వద్దు అని ఆ సినిమాతొ చెప్పారు. ఆ తర్వాత చేసిన ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ తనలోని మరో కోణం బయటపెట్టారు. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ అంటూ త్వరలో రాబోతున్నారు. అయితే ఇది దర్శకుడు కోణంలోనే. ఎందుకంటే ఆయన నటుడు కూడా.
Tharun Bhascker
‘మహానటి’ సినిమాలో చిన్న పాత్రతో మొదలైన తరుణ్ భాస్కర్ యాక్టర్ కెరీర్.. ఆ తర్వాత కేమియోలు, చిన్న పాత్రలతో సాగుతూ ఉంది. ఈ క్రమంలో ఆయన యాక్టింగ్ కెరీర్లో ఓ కొత్త జర్నీ స్టార్ట్ కాబోతోంది. ఎందుకంటే ఆయన తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు అని సమాచారం. యువ తమిళ దర్శకుడు, హీరో ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న సినిమాతోనే ఎంట్రీ ఉండబోతోంది.

కొన్ని రోజుల క్రితం వెరైటీ కాన్సెప్ట్‌తో ఓ సినిమా అనౌన్స్ చేశారు. ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ లాంటి సినిమాలతో ప్రదీప్ రంగనాథన్ తానేంటి, తన టాలెంట్ ఏంటి? అనేది క్లియర్‌గా చూపించారు. ఇప్పుడు నిర్మాతగా. పీఆర్ షో అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి, అందులో రూపొందుతున్న మొదటి ప్రాజెక్ట్‌ను ఇటీవల ప్రకటించారు. దీనికి ప్రదీప్ కథ కూడా ఇస్తున్నారు. ఇందులో ప్రముఖ కథానాయిక మమితా బైజు, యువ దర్శకుడు అశ్వత్ మరిముత్తు, సీనియర్ తెలుగు యాక్టర్ శివాజీ, శ్వాసిక, అనామిక మహి ముఖ్య పాత్రధారులు అని ప్రకటించారు.
ఇందులో అశ్వత్ మరిముత్తు ప్లేస్‌లో తరుణ్ భాస్కర్ నటిస్తున్నారు అని సమాచారం. రజనీకాంత్ సినిమా పనుల్లో అశ్వత్ బిజీగా ఉండటంతో ఈ మార్పు చేశారని సమాచారం. ఇక ఈ సినిమాను ఆరుగురు దర్శకులు తెరకెక్కిస్తున్నారు. ‘ది ఆల్ఫా యూనిట్’ అనే పేరుతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సౌత్ సెన్సేషనల్ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సినిమా కాన్సెప్ట్ ఏంటి అనేది చెప్పలేదు కానీ.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గానే ఉంటుంది అంటున్నారు. అయితే దీనికి చిన్న క్రైమ్ టచ్ ఇస్తున్నారు అని సమాచారం.











