Mega Family: ఆ ఇల్లు కారణంగానే చిరంజీవి ఇబ్బందులు పడుతున్నారా?

  • September 28, 2023 / 06:40 PM IST

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు ఇక ఈయన ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచి ఎంతోమంది ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోలుగా సక్సెస్ అందుకుంటున్నారు. ఇలా ఒకానొక సమయంలో అగ్ర హీరోగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగినటువంటి చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత నటించే సినిమాలన్నీ కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. దీంతో చిరంజీవి సినిమాల పట్ల అభిమానులు కూడా కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఇలా చిరంజీవి తన సినిమాల కారణంగా సోషల్ మీడియాలో కూడా భారీగా ట్రోలింగ్ కు గురవుతున్నారు. ఇక ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీ వరుసగా విమర్శలను ఎదుర్కొంటున్న సంగతి మనకు తెలిసిందే. చిరంజీవి భోళా శంకర్ సినిమా డిజాస్టర్ కావడం అలాగే నిహారిక వెంకట చైతన్య విడాకులు జరగడం, వరుణ్ తేజ్ పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడం వంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి అంటే అది సినిమాలో ఉన్నటువంటి లోపాలు కారణమని చెప్పవచ్చు.

కానీ సోషల్ మీడియాలో మాత్రం చిరంజీవి ఫ్యామిలీ ఈ విధంగా తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కోవడానికి కారణం ఒక ఇల్లే కారణం అంటూ పెద్ద ఎత్తున ఒక రూమర్ క్రియేట్ చేశారు. మొగల్తూరులో చిరంజీవి ఇల్లు అంటూ గత కొంతకాలంగా వార్తల్లో ప్రచారం ఉంది ఈ ఇంటిని లైబ్రరీ కోసం ఇస్తానని చెప్పిన చిరంజీవి ఇప్పుడు దానిని 3 లక్షలకు అమ్మేశారు అంటూ ఒక వార్త గతంలో వైరల్ గా మారింది.

ఇక ఈ ఇల్లు (Mega Family) చిరంజీవిది కాదని చిరంజీవి గారి అమ్మమ్మ ఊరు ఆ ఇంటిలో తాను పుట్టానే తప్ప ఆ ఇంటిపై నాకు ఎలాంటి హక్కు లేదని చిరంజీవి పలు సందర్భాలలో తెలియచేశారు. ఇక లైబ్రరీ ఏర్పాటుకు తన సొంత డబ్బును ఉపయోగించి ఒక బిల్డింగ్ కూడా కట్టించానని చెప్పారు. అయినప్పటికీ కొందరు మాత్రం లైబ్రరీ కోసం ఇస్తానన్న ఇంటిని చిరంజీవి అమ్ముకున్న కారణంగానే ఇలా ఇబ్బందులు పడతారని ఆ ఇల్లు చిరంజీవి ఫ్యామిలీకి బ్యాడ్ సెంటిమెంట్ గా మారింది అంటూ ఈ వార్తలను వైరల్ చేయడంతో మెగా ఫాన్స్ మాత్రం పూర్తిగా ఖండిస్తున్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus