Naresh, Pavitra Lokesh: నరేష్ పవిత్రలా లవ్ స్టోరీ ఏలా స్టార్ట్ అయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో ఎక్కడ చూసినా నరేష్ పవిత్ర లోకేష్ ల వ్యవహారమే హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక వీరిద్దరి ప్రేమ వ్యవహారంలోకి నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఎంట్రీ ఇచ్చి ఆమె చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.అంతే కాదు నేను విడాకులు ఇవ్వకుండా మూడో పెళ్లి ఎలా చేసుకుంటావో నీ అంతు చూస్తా అంటూ బహిరంగంగానే వార్నింగులు ఇవ్వడం మనం ఎన్నో చూసాం.

ఇక అలాంటి ఈ జంట ఎట్టకేలకు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ మధ్య కాలంలోనే మళ్లీ పెళ్లి అనే సినిమా తీసి తమ జీవితాన్ని ప్రేక్షకుల ముందు పెట్టారు. ఆరు పదుల వయసు దాటిన నరేష్ నాలుగు పదుల వయసు దాటిన పవిత్ర లోకేష్ ఇద్దరు ఒకరికి ఒకరు బాగా నచ్చారు. దాంతో పెళ్లి కాకముందే లివింగ్ రిలేషన్ లో కూడా ఉన్నారు.

అంతేకాదు వీరి రిలేషన్ కృష్ణ గారు కూడా ఒప్పుకున్నారని, మహేష్ బాబు కూడా వారి ఫ్యామిలీ లోకి తనని కోడలిగా యాక్సెప్ట్ చేసింది అని పవిత్ర లోకేష్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే నరేష్ పవిత్ర లోకేష్ లు ఇద్దరు ఒక్కటవ్వడానికి కారణమైన హీరో ఎవరో కాదు మహేష్ బాబు చిన్న బావ హీరో సుధీర్ బాబట. అయితే నరేష్ పవిత్ర లు కలవడానికి ఈ హీరో ఎలా కారణమయ్యాడా అని భావిస్తున్నారా..

అవును ఈ హీరోనే కారణమయ్యాడు.ఎలా అంటే..సుధీర్ బాబు హీరోగా వచ్చిన సమ్మోహనం సినిమాలో నరేష్ పవిత్ర ఇద్దరూ జంటగా నటించారు. ఇక ఈ సినిమాలో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు వీళ్ళిద్దరి మధ్య ఉన్నాయి. దాంతో వీరిద్దరూ షూటింగ్ టైం లోనే ప్రేమలో పడ్డారట.ఇలా పరోక్షంగా మహేష్ బాబు బావ సుధీర్ బాబు నరేష్ పవిత్రల ప్రేమకి కారణమయ్యారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus