Rakshasudu2: వేరియేషన్ల పంట పండించనున్న ‘రాక్షసుడు 2’

  • August 4, 2021 / 02:47 PM IST

తమిళంలో ఘనవిజయం సాధించిన ‘రత్తసన్‌’ను తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా ‘రాక్షసుడు’గా తీసుకొచ్చారు. రమేశ్‌ వర్మ రూపొందించిన ఈ సినిమా మంచి విజయమే అందుకుంది. అయితే ఇటీవల సినిమాకు సీక్వెల్‌ను రూపొందిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అయితే అందులో హీరో ఎవరు అనే విషయం చెప్పలేదు. అయితే ఆ హీరో ఎవరో చూచాయగా తెలుస్తోంది. సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

అంతేకాకుండా వంద కోట్ల రూపాయల వరకు బడ్జెట్‌ను కూడా అనుకున్నారట. దీంతో స్టార్‌ హీరోనే తీసుకుంటారు అనేది అర్థమైంది. కానీ తెలుగులో ఇప్పుడు ఆ సినిమా చేసేంత స్టార్‌ అనేది మాత్రం అర్థంకాలేదు. అయితే ఆ హీరో తెలుగు నుండి కాదని, తమిళం నుండి వస్తున్నాడని సమాచారం. అతనే విజయ్‌ సేతుపతి. అవును మక్కళ్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి రెండో ‘రాక్షసుడు’గా కనిపించబోతున్నాడట. దీని కోసం ఇప్పటికే చిత్రబృందం విజయ్‌ సేతుపతిని సంప్రదించిందని,

ఆయన నుండి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చిందని తెలుస్తోంది. అంతా అనుకున్నట్లుగా జరిగితే త్వరలో సినిమాకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. విజయ్‌కు తెలుగు, తమిళంలో మార్కెట్‌ బాగానే ఉంది. హిందీలో కూడా ఆదరిస్తారనే నమ్మకంతోనే ఈ సినిమాలోకి తీసుకుంటున్నారట.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus