BRO Movie: బ్రో మూవీని ఆ వర్గం ట్రోల్ చేస్తోందా.. షాకింగ్ విషయాలు రివీల్ అయ్యాయిగా!

ప్రభాస్, సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బ్రో మూవీ నుంచి ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్, టీజర్ బాగానే ఉన్నా కొంతమంది కావాలని నెగిటివ్ కామెంట్లు చేయడం జరిగింది. మరో ఆరు రోజుల్లో బ్రో మూవీ రిలీజవుతుండగా ఓవర్సీస్ లో ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. ఈ నెల 22వ తేదీన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుందని అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ మెటీరియల్ పై వస్తున్న నెగిటివ్ కామెంట్లకు సంబంధించి బ్రో నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ షాకింగ్ విషయాలను రివీల్ చేశారు.

అదే సమయంలో పీపుల్స్ మీడియా బ్యానర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి కూడా ఆయన వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. బ్రో సినిమా నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ 70 నుంచి 80 శాతం వరకు బాగుందని ఆయన అన్నారు. అమెరికాలోని ఒక వర్గం బ్రో సినిమా కంటెంట్ బాగున్నా కావాలని ఈ సినిమాను ట్రోల్ చేసిందని విశ్వ ప్రసాద్ చెప్పుకొచ్చారు. బ్రో సినిమాపై ట్రోలింగ్ ఏ విధంగా జరిగిందో ఏ ఐపీల నుంచి చేశారో తనకు తెలుసని విశ్వ ప్రసాద్ అన్నారు.

పవన్ తో ఎప్పటినుంచో పరిచయం ఉందని గతంలోనే పవన్ తో సినిమా చేయాలని అనుకున్నామని ఆయన వెల్లడించారు. బ్రో మూవీ ఫ్యామిలీ మూవీ అని నెటిజన్ల నుంచి నిర్మాత చెప్పుకొచ్చారు. ఇతర టాలీవుడ్ స్టార్ హీరోలతో సైతం సినిమాలు చేయాలని ఉందని ఆయన కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ ఐడియాలజీ అంటే బాగా ఇష్టమని విశ్వ ప్రసాద్ పేర్కొన్నారు.

ప్రభాస్ మారుతి కాంబో మూవీని సమయం వచ్చినప్పుడు అధికారికంగా ప్రకటిస్తామని ఈ సినిమా రిలీజ్ గురించి తాను ఇప్పుడే చెప్పలేనని నిర్మాత వెల్లడించారు. బ్రో (BRO Movie) సినిమా కమర్షియల్ గా రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus