హీరోలను హిట్ ట్రాక్ ఎక్కించిన డైరక్టర్స్

సినీ పరిశ్రమలో విజయాలే కొలమానం. ప్రతి హిట్ కి నేమ్, ఫేమ్ పెరిగిపోతుంటాయి. ఎన్ని హిట్లు ఇచ్చిన హీరో అయిన పరాజయం పలకరిస్తే షేక్ అవుతాడు. పరుగులో వెనక పడిపోతుంటాడు. అలా ఫ్లాప్ లతో సతమవుతున్న హీరోలను హిట్ ట్రాక్ ఎక్కించిన దర్శకులపై ఫోకస్..

హరీష్ శంకర్పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రం తర్వాత అపజయాలను చవిచూశారు. పదేళ్ళపాటు మంచి హిట్ లభించలేదు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన గబ్బర్ సింగ్ చిత్రం ద్వారా ఫుల్ ఫామ్ లోకి వచ్చారు.

కొరటాల శివసూపర్ స్టార్ మహేష్ బాబు దూకుడుతో టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా అనిపించుకున్నారు. కానీ తరవాత వచ్చిన నేనొక్కడినే. ఆగడు సినిమాలు ఇబ్బంది కలిగించాయి. కొరటాల శివ శ్రీమంతుడు చిత్రంతో మహేష్ బాబుకు పూర్వ వైభవం తీసుకొచ్చారు.

పూరి జగన్నాథ్హిట్ అనే ఆకలితో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి టెంపర్ సినిమా ద్వారా మంచి విందు ఇచ్చారు పూరి జగన్నాథ్.

చందు మొండేటియువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కెరీర్ ని ప్రేమమ్ చిత్రం ద్వారా చందు మొండేటి మలుపు తిప్పారు.

విక్రమ్ కుమార్ప్రేమ కథలతో విజయాలను అందుకొని, యాక్షన్ కథలతో ట్రాక్ తప్పిన యువ హీరో నితిన్ ను ఇష్క్ చిత్రం ద్వారా విక్రమ్ కుమార్ విజయ బాట పట్టించారు.

నాగ్ అశ్విన్నేచురల్ హీరో నాని వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్నప్పుడు నాగ్ అశ్విన్ “ఎవడే సుబ్రహ్మణ్యం” సినిమాతో రీ బ్రేక్ ఇచ్చారు. దీని తర్వాత నాని చిత్రాలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి.

అనిల్ రావి పూడినందమూరి కళ్యాణ్ రామ్ లోని కామెడీ టైమింగ్ ని వెలికి తీసి అతని కెరీర్ గేర్ మార్చిన ఘనత పటాస్ డైరక్ట్ చేసిన అనిల్ రావి పూడి కే దక్కుతుంది.

సుధీర్ వర్మయువ హీరో నిఖిల్ ని సింగిల్ హీరో గా నిలబెట్టిన చిత్రం స్వామి రారా. అందుకే నిఖిల్ సినీ పయనంలో స్వామి రారా సినిమాను డైరక్ట్ చేసిన సుధీర్ వర్మ కు ప్రత్యేక స్థానం ఉంది.

పరశురామ్అల్లు వారి హీరో అల్లు శిరీష్ కి పరశురామ్ “శ్రీరస్తు శుభమస్తు” మూవీ ద్వారా మంచి బ్రేక్ ఇచ్చారు.

బోయపాటి శ్రీనునటసింహ నందమూరి బాలకృష్ణ పని అయిపోయిందని, మల్టీ స్టారర్ చిత్రాలు తీసుకోవడం బెటర్ అంటూ విమర్శలు వినిపిసున్నా సమయంలో బాలయ్య సింహ సినిమాతో గర్జించారు. ఇలా బోయపాటి శ్రీను బాలయ్యకు స్టార్ డమ్ ను నిలబెట్టారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus