Samantha: ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 రేడి.. రిలీజ్ ఎప్పుడంటే?

  • May 4, 2021 / 07:17 PM IST

ఓటీటీ బిజినెస్ కు మరోసారి పట్టు దొరికినట్లయ్యింది. కోవిడ్ దెబ్బకు మరోసారి థియేటర్లు మూత పడడంతో జనాల దృష్టి ఓటీటీ కంటెంట్ పైనే పడింది. రానున్న రోజుల్లో పెద్ద సినిమాలు కూడా డైరెక్ట్ గా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లోనే విడుదల కానున్నాయి. ఇక వెబ్ సిరీస్ ల గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. స్టార్ ఇమేజ్ తో సంబంధం లేకుండా నటీనటులు వెబ్ కంటెంట్ లో యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఇక టాలీవుడ్ జెస్సి సమంత మొదటిసారి ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో నటించిన విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన మొదటి సీజన్ లో మనోజ్ బాజ్ పయ్, ప్రియమణి నటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ పాత్రలకు సమంత స్టార్ డమ్ కూడా తోడవ్వనుంది. సమంత ఒక టెర్రరిస్ట్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. సీజన్ 2కు అభిమనులు చాలా మంది ఉన్నారు. ఇక గతకొన్ని నెలలకు పైగా ఊరిస్తున్న ఆ వెబ్ సిరీస్ మొత్తానికి రిలీజ్ విషయంలో ఒక క్లారిటికి వచ్చేసిందట.

రాజ్ & డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ఆమెజాన్ ప్రైమ్ లో జూన్ మొదటివారంలో రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మరికొన్ని విభిన్నమైన వెబ్ కంటెంట్ లు కూడా అదే నెలలో పోటీ పడబోతున్నట్లు సమాచారం.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus