మన దేశంలో వెబ్‌సిరీస్‌లు చాలా ఏళ్లుగా ఉన్నా.. ‘ఫ్యామిలీ మ్యాన్’ (Family Man) వచ్చాక వాటికంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడే ట్రెండ్ మొదలైంది. ఇప్పటివరకూ రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ వెబ్‌సిరీస్ మూడో సీజన్ రాకకు సర్వం సిద్ధమైంది. త్వరలోనే ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ మొదలవుతుంది అని చెబుతూ టీమ్ ఓ టీజర్‌ను రిలీజ్ చేసింది. ఈ సిరీస్‌లో ఎప్పటిలానే మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee) కీలక పాత్ర పోషించగా.. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందింది.
మొత్తం యాక్షన్ సన్నివేశాలు, ఫ్లాష్ కట్‌లతో నింపేసిన ఈ టీజర్‌లో ఒకే ఒక డైలాగ్ ఉంది. ‘మీరేం చేస్తుంటారు’ అని ఓ వ్యక్తి శ్రీకాంత్ తివారీ (మనోజ్ బాజ్‌పాయ్) (Manoj Bajpayee) ని అడగ్గా.. ‘నేను లైఫ్ అండ్ రిలేషన్‌షిప్ కౌన్సిలర్’ అని చెచుతాడు. దానికి ఆయన భార్య సుచిత్ర తివారీ (ప్రియమణి) (Priyamani) బ్లాంక్ ఫేస్ పెట్టి చూస్తూ ఉంటుంది. అంటే తివారీ ఫ్యామిలీ డ్రామా ఈ సారి కూడా బాగానే కొనసాగనుంది అని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక యాక్షన్ సీక్వెన్స్‌లు భారీస్థాయిలో ఉంటాయి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సిరీస్ దానికి ఫేమస్.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది అనే విషయం తెలిసిందే. ఇక ఈ స్పెషల్ వీడియోలో సంగతి చూస్తే నిమ్రత్ కౌర్ కొద్దిసేపు కనిపించింది. టీజర్ టీజర్ చివర్లో జైదీప్ అహ్లావత్ ముఖానికి మాస్క్‌తో కనిపించాడు. అంటే ఈసారి సిరీస్ మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee) వర్సెస్ జైదీప్ అహ్లావత్ అని చెప్పొచ్చు. ఉగ్రవాదుల కుట్రలను భగ్నం చేయడానికి థ్రెట్ అనాలిసిస్ అండ్ సర్వైలెన్స్ సెల్‌లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా శ్రీకాంత్ తివారీ బృందం చేసిన పనిని ఫస్ట్ సీజన్‌లో చూపించారు.
రెండో సీజన్‌లో తమిళ టైగర్స్ నుండి ఎదురైన దాడిని ఎలా తిప్పికొట్టారో చూపించారు. ఇక మూడో సీజన్‌లో ఈశాన్య రాష్ట్రాలపై చైనా చేసే దాడులను ఎలా ఎదుర్కొన్నారు? కొవిడ్ 19 తదితర అంశాలను చూపిస్తారని గతంలో వార్తలొచ్చాయి. మరి ఏం అంశాలతో సిరీస్ తెరకెక్కిందో చూడాలి. మరి మూడో సీజన్‌తో ఫ్యామిలీ మ్యాన్ రెస్ట్ తీసుకుంటాడో లేక ఫలితం చూసి నాలుగో సీజన్ వరకు వెళ్తాడా అనేది చూడాలి.