‘గ్యాంగ్ లీడ‌ర్’ గొడవ నా వరకూ రాలేదు..!

నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘జెర్సీ’. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 19 న విడుదల కాబోతుంది. ఈ చిత్రం తరువాత విభిన్న చిత్రాల దర్శకుడు విక్ర‌మ్ కె.కుమార్ డైరెక్షన్లో ‘గ్యాంగ్ లీడ‌ర్‌’ అనే చిత్రం చేస్తున్నాడు. అయితే ఈ చిత్ర టైటిల్ విషయంలో వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఇది మా టైటిల్‌’ అంటూ ఓ నిర్మాత ఫిలిం ఛాంబ‌ర్‌లో కేసు వేసాడు. ఆల్రెడీ మా చిత్రం పట్టాలెక్కేసిందని ఆ హీరో, నిర్మాత చెప్పుకొచ్చారు. మరి ఈ రెండింటిలో ఏ చిత్రానికి ‘గ్యాంగ్ లీడ‌ర్‌’ టైటిల్ ద‌క్కుతుందనిది చర్చనీయాంశం అయ్యింది.

తాజాగా ఈ విషయం పై నాని క్లారిటీ ఇచ్చాడు. ‘జెర్సీ’ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో నాని ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు. నాని మాట్లాడుతూ…“ ఈ టైటిల్ వివాదం నా వరకూ రాలేదు. ‘గ్యాంగ్ లీడ‌ర్’ సినిమాకి నేను కూడా పెద్ద అభిమానిని. అయితే ఆ క‌థ‌కూ, విక్ర‌మ్ సినిమాకీ ఎలాంటి సంబంధం ఉండ‌దు. కానీ… ఈ క‌థ‌కు ‘గ్యాంగ్ లీడ‌ర్’ అనే పేరు మిన‌హా మ‌రేదీ మ్యాచ్ కాదు. ఈ సినిమా చూశాక‌… ‘గ్యాంగ్ లీడ‌ర్‌’ కంటే బెట‌ర్ టైటిల్ ఉండ‌ద‌ని ప్రేక్ష‌కులే చెబుతారు. అప్ప‌టికీ ”ఈ సినిమాకి గ్యాంగ్ లీడ‌ర్ అనే పేరు అవ‌స‌రం లేద‌ని ఎవ‌రైనా చెబితే .. టైటిల్ మార్చేస్తాం” అంటూ నాని బదులిచ్చాడు. మరి ఈ విషయం పై ఆ చిత్ర బృందం ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus