‘బంగార్రాజు’ ‘బ్రహ్మాస్త్ర’ వంటి చిత్రాలతో ఫామ్లో ఉన్న అక్కినేని నాగార్జున ‘ది ఘోస్ట్’ గా ఈ దసరాకి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి’, ‘నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్’ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది.
అయితే అక్టోబర్ 5న రిలీజ్ అయిన ఈ మూవీకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. రెండో రోజు మరింతగా తగ్గాయి. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే:
నైజాం | 0.79 cr |
సీడెడ్ | 0.39 cr |
ఉత్తరాంధ్ర | 0.47 cr |
ఈస్ట్ | 0.28 cr |
వెస్ట్ | 0.12 cr |
గుంటూరు | 0.27 cr |
కృష్ణా | 0.23 cr |
నెల్లూరు | 0.17 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 2.72 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.23 cr |
ఓవర్సీస్ | 0.35 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 3.30 cr |
‘ది ఘోస్ట్’ చిత్రం తెలుగు వెర్షన్ కు రూ.22.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.23 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.కానీ మొదటి రోజు ఈ మూవీ కేవలం రూ.3.3 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.19.57 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అది ఈజీ టార్గెట్ కాదు. లాంగ్ వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకుంటే తప్ప అది అసాధ్యమని చెప్పాలి.
Most Recommended Video
ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!