The GOAT Trailer: ఆ 2 సీన్లు ‘వినయ విధేయ రామ’..లా అనిపించాయిగా..!

విజయ్ కి (Vijay Thalapathy) తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. గత 5 ఏళ్లుగా అతని సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యి.. అసాధారణ ఓపెనింగ్స్ ను సాధిస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. విజయ్ గత చిత్రం ‘లియో’ (LEO) కి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ రూ.25 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది. ఇక సెప్టెంబర్ 5న విజయ్ నటించిన ‘ది గోట్'(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్)  (The Greatest of All Time ) అనే మూవీ విడుదల కానుంది.

ఇప్పటికే ఈ చిత్రం నుండి పాటలు, గ్లింప్స్ బయటకు వచ్చాయి. వాటికి కొంత మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితం ట్రైలర్ ని వదిలారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 52 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘ది గోట్’ లో విజయ్ ఓ స్పై ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. అందులో భాగంగా అతను రకరకాల గెటప్..లలో కనిపించబోతున్నట్టు స్పష్టమవుతుంది.

తండ్రీ కొడుకులుగా కూడా విజయ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. అయితే గాంధీ అనే పాత్రకి అన్నలుగా ప్రశాంత్ (Prashanth) , ప్రభుదేవా (Prabhu Deva) .. వదినలుగా లైలా (Laila) , స్నేహ (Sneha) వంటి వారు కనిపించబోతున్నట్టు ట్రైలర్ చెబుతుంది. ఈ క్రమంలో వచ్చే 2 సీన్లు ‘వినయ విధేయ రామ’..ని గుర్తుచేసే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు.

యాక్షన్ సీన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. యువన్ శంకర్ (Yuvan Shankar Raja) బిజీయం ఎందుకో విజయ్ ఇమేజ్ ను మ్యాచ్ చేసేట్లు కనిపించడం లేదు. ఒకవేళ కథకు తగ్గట్టు అతను బీజీయం కలర్ ఉందేమో..! అది సినిమా చూస్తున్నప్పుడు క్లారిటీ రావచ్చు..! ‘ఎంత వయసు అయిపోయినా ఎ లయన్ ఈజ్ ఆల్వేజ్ ఏ లయన్’ అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

The GOAT Trailer

ప్రశాంత్ నీల్ పై ప్రభాస్ ఫన్నీ కౌంటర్.. సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్న వీడియో.!

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus