The Greatest of All Time Collections: ‘ది గోట్’.. 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay) హీరోగా తెరకెక్కిన ‘ది గోట్'(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’) (The Greatest of All Time)  చిత్రం నిన్న అంటే సెప్టెంబర్ 5న విడుదల అయ్యింది. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)  హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలోస్నేహ (Sneha) , లైలా (Laila) వంటి సీనియర్ హీరోయిన్లు కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్(Prashanth), జయరామ్ సుబ్రహ్మణ్యం (Jayaram), ప్రభు దేవా (Prabhudeva) వంటి స్టార్లు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించారు. యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) ఈ చిత్రానికి సంగీతం అందించగా వెంకట్ ప్రభు  (Venkat Prabhu)  దర్శకత్వం వహించాడు.

The Greatest of All Time Collections

విజయ్ కి తెలుగులో మంచి క్రేజ్ ఉండటంతో ‘ది గోట్’ కి మంచి బిజినెస్ జరిగింది. కానీ మొదటి రోజు సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.85 cr
వైజాగ్ 0.59 cr
సీడెడ్ 0.65 cr
ఈస్ట్ 0.25 cr
వెస్ట్ 0.17 cr
కృష్ణా 0.23 cr
గుంటూరు 0.30 cr
నెల్లూరు 0.30 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 4.16 cr

‘ది గోట్’ చిత్రానికి తెలుగులో రూ.20.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.21 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లో ఈ సినిమా రూ.4.16 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ మూవీ ఇంకో రూ.16.84 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

’35- చిన్న కథ కాదు’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

 

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus