టాలీవుడ్ సీనియర్ హీరో, ప్రస్తుతం విలక్షణ నటుడిగా రాణిస్తున్న జగపతిబాబు… మన దర్శక ధీరుడు రాజమౌళికి దగ్గర బంధువు అవుతాడనే సంగతి బహుశా చాలా మందికి తెలిసుండదు. రాజమౌళి సినిమాలకు సంబంధించిన ప్రొడక్షన్ పనులు అన్నీ ఆయన కొడుకు కార్తికేయనే చూసుకుంటాడు అన్న సంగతి మాత్రం అందరికీ తెలిసిన సంగతే.నిర్మాతగా ఇతను ‘ఆకాశవాణి’ అనే చిత్రాన్ని కూడా నిర్మించారు. అటు తర్వాత వివాహం చేసుకున్నాడు. కార్తికేయ వివాహం చేసుకున్నది మరెవరినో కాదు…
తన స్నేహితురాలు పూజ ప్రసాద్ ను.. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నాడు. పూజా ప్రసాద్.. జగపతిబాబు సోదరుడు రాంప్రసాద్ కూతురు అన్న సంగతి తెలిసిందే. ఆ రకంగా చూస్తే జగపతి బాబుకి కార్తికేయ అల్లుడు వరుస అనమాట. అప్పుడు జగ్గూభాయ్, జక్కన్న లు వియ్యంకులు అవుతారన్న మాట. అంటే బావ, బావగారు అని కూడా పిలుచుకోవచ్చు. రాజమౌళి ఓ పక్క ‘బాహుబలి'(సిరీస్), ‘ఆర్.ఆర్.ఆర్’ లతో ఇండియన్ వైడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ను అందుకుని..
టాలీవుడ్ రేంజ్ ను పెంచగా.. మరోపక్క జగపతి బాబు విలక్షణమైన పాత్రలు, విలన్ పాత్రలు చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా స్టార్ నటుడిగా రాణిస్తున్నాడు. అంతేకాదు తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా ఛాన్స్ లు దక్కించుకుంటూ పాన్ ఇండియా నటుడు అనిపించుకుంటున్నాడు. ఇక కార్తికేయ- పూజా ల వివాహం 2018 డిసెంబర్ లో జైపూర్ లో ఘనంగా జరిగింది.
వీరి పెళ్లి వేడుకకు ప్రభాస్, అనుష్క, నాని, అఖిల్, ఎన్టీఆర్, రాంచరణ్, రానా, ఉపాసన వంటి వారు హాజరయ్యారు. వీరి పెళ్లి కోసం దాదాపు రూ.10 కోట్లు ఖర్చు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.