Shruti Haasan: స్క్విడ్‌ గేమ్‌కి… శ్రుతి హాసన్‌కి లింకేంటో తెలుసా?

వెబ్‌సిరీస్‌ అభిమానులను ఇప్పుడు కదిలిస్తే… వచ్చే టాపిక్‌ ‘స్క్విడ్‌ గేమ్‌’. అంతలా ఆకట్టుకుంటోంది ఈ వెబ్‌సిరీస్‌. కొత్త కథలను ఆదరించే భారతీయ ప్రేక్షకులు ముఖ్యంగా తెలుగు యువ ప్రేక్షకులు కూడా ఈ సిరీస్‌ను తెగ చూస్తున్నారు. అయితే ఈ సిరీస్‌లో చూపించిన కాన్సెప్ట్‌ అదే… ఆ గేమింగ్‌ కాన్సెప్ట్‌ భారతీయ వెండితెర మీద ఇప్పటికే వచ్చింది. అది కూడా 12 ఏళ్ల క్రితమే అంటే నమ్మగలరా. ‘స్క్విడ్‌గేమ్‌’ విడుదలైనప్పటి నుంచి…

ఈ సిరీస్‌ను ‘ది గాడ్స్ విల్‌’ అనే జపాన్‌ సినిమా నుండి కాపీ కొట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే 2009 లోనే ఈ కథను రాసుకున్నట్లు రచయిత చెప్పుకొచ్చారు. అయితే అదే ఏడాది బాలీవుడ్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌, శ్రుతి హాసన్‌, సంజయ్‌దత్‌ ప్రధానపాత్రల్లో ‘లక్‌’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కాన్సెప్ట్‌ కూడా ‘స్క్విడ్‌ గేమ్‌’ తరహాలోనే ఉంటుంది. కావాలంటే ఓ సారి సినిమా చూడండి మీకే తెలుస్తుంది.

‘లక్‌’లోనూ జీవితం బోరింగ్‌గా అనిపించి కొందరు బిలియనీర్లు ఇలాంటి ప్రాణాంతక పోటీలనే నిర్వహిస్తారు. అప్పులపాలైన కొందరు ఈ నెత్తుటి పోటీల్లో పాల్గొంటారు. అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విఫలమైంది. అప్పటి ట్రెండ్‌కి ఈ కాన్సెప్ట్‌ నచ్చలేదు. అయితే ఇప్పుడు ఆ సినిమా చూస్తే… మనవాళ్లు ముందే ఊహించేశారే అనిపిస్తుంది. అన్నట్లు ‘లక్‌’ శ్రుతి హాసన్‌ మొదటి సినిమా.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus