The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది
- May 13, 2026 / 12:48 PM ISTByPhani Kumar
మన టాలీవుడ్ హీరోలందరూ ఒక పట్టాన డేట్స్ ఇవ్వరు అనే విమర్శ ఎప్పటినుండో ఉంది. స్టార్ హీరోలే కాదు మిడ్ రేంజ్ హీరోలు కూడా ఇందుకు అతీతం కాదు అనే కామెంట్స్ కూడా ఎప్పటికప్పుడు వినిపిస్తుంటాయి.
The Paradise
కానీ ‘నేచురల్ స్టార్’ నాని విషయంలో ఆ విమర్శలు తక్కువ. సినిమా సెట్స్ పైకి తీసుకెళ్ళగానే క్యాలెండర్‌లో డేట్ లాక్ చేసేసి, అనుకున్న టైమ్‌కి థియేటర్లలో మొదటి షో పడేలా చేయడం అతని స్టైల్. కానీ ఇప్పుడు అతను కూడా ట్రాక్ తప్పినట్టు అనిపిస్తుంది.

అప్పుడప్పుడు అతని అతి జాగ్రత్త కూడా అడ్డంకులు సృష్టిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని ‘ది ప్యారడైజ్'(The Paradise) అనే భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాని మొదట మార్చి నెలలోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అనుకున్న టైంకి షూటింగ్ పూర్తికాకపోవడంతో ఆగస్టుకి వాయిదా వేశారు.ఇప్పుడు ఆగస్టు డెడ్‌లైన్‌ను అందుకోవడానికి కూడా ‘ది పారడైజ్’ యూనిట్ కష్టపడుతోంది అని చెప్పాలి. ఎందుకంటే ‘ది పారడైజ్’ అనేది నాని కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన ప్రయోగం.
ఎప్పటికప్పుడు రషెస్ చూస్తున్న నాని సంతృప్తి చెందకపోతే… రీషూట్లు చేయాలని పట్టుబడుతున్నాడట. ఈ క్రమంలో కొన్ని కీలక సీన్లను మళ్ళీ రీషూట్ చేయాలని డైరెక్టర్ శ్రీకాంత్ కి తెలిపాడట.అవుట్‌పుట్ విషయంలో నాని కాంప్రమైజ్ కాడు సరే.. మరి ఆకాశాన్ని తాకుతున్న బడ్జెట్ లెక్కల సంగతేంటి? సడన్ గా వచ్చిన రీషూట్లతో ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి బడ్జెట్ లెక్కలన్నీ తారుమారవుతున్నాయని ఇండస్ట్రీ టాక్.
ఇక ‘ది పారడైజ్’ లో కాయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు వంటి క్రేజీ యాక్టర్స్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ‘ఆయా షేర్’ పాట ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయింది.దాని వల్ల సినిమాపై హైప్ పెరగడంతో.. బిజినెస్ డీల్స్ చాలా వరకు క్లోజ్ అయిపోయాయి. ఎటొచ్చి రీ- షూట్ల కారణంగా బడ్జెట్ పెరిగిపోతుంది. అదే నిర్మాతని టెన్షన్ పెడుతుంది.
ఇదిలా ఉంటే… ‘ది పారడైజ్’ టీమ్ మాత్రం ఈ రూమర్స్ ని తోసిపుచ్చింది. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో షూటింగ్ షెడ్యూల్స్ నడుస్తున్నాయని అనుకున్న టైమ్..కి సినిమా రిలీజ్ అవుతుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేసింది. చూడాలి మరి ఫైనల్ గా ఏమవుతుందో..!











