The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

[Click Here For Detailed Full Review]

నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత తెరకెక్కిన చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise). గ్లింప్స్, టీజర్, ఆయా షేర్ సాంగ్, ఏష నాగుల సాంగ్ వంటివి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. అందుకే ట్రైలర్ లేకుండానే సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. సెప్టెంబర్ 24న, అంటే రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీమియర్ షోలు ఆల్రెడీ చాలా చోట్ల పడ్డాయి. సినిమా చూసిన వారు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు.

The Paradise Movie Twitter Review

వారి టాక్ ప్రకారం.. సినిమా కథ 1980ల బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందట. విలన్ మోహన్‌బాబు ట్రాక్‌తో సినిమా మొదలవుతుందట. స్టార్టింగ్‌లో వచ్చే హీరో మదర్ సీక్వెన్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటుందట. ఆ తర్వాత వచ్చే జైలు ఫైట్ ద్వారా హీరో ఎంట్రీ ఉంటుందట. ఆ ఫైట్ మాస్ ఆడియన్స్‌కి మంచి కిక్ ఇస్తుందని అంటున్నారు. ఆ తర్వాత వచ్చే బిర్యానీ ఫైట్, ఆయా షేర్ సాంగ్, హీరోయిన్ కయాడు గ్లామర్ వంటివి టార్గెటెడ్ ఆడియన్స్‌ను మెప్పిస్తాయట. ఇంటర్వెల్ సీక్వెన్స్ మాస్ ఆడియన్స్‌కి ఫుల్ ఫీస్ట్ ఇస్తుందని అంటున్నారు.

[Click Here For Detailed Full Review]

నాని, మోహన్‌బాబుకు ఫోన్ చేసి మాట్లాడే సీన్ కూడా మంచి హై ఇస్తుందట. సెకండాఫ్‌లో వచ్చే ఏష నాగుల సాంగ్ మంచి బ్లాస్ట్ అంటున్నారు. అలాగే ప్రీ క్లైమాక్స్ కూడా బాగుందట. మోహన్‌బాబు రోల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉందట. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా హైలైట్ అంటున్నారు. మరి మార్నింగ్ షోల నుండి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

[Click Here For Detailed Full Review]

 

 

సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

 

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus