Om Raut, Kriti Sanon: ఓం రౌత్ వ్యవహారం పై మండిపడిన చిలుకూరి బాలాజీ టెంపుల్ పూజారి!

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభాస్, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నటువంటి చిత్రం ఆది పురుష్. ఈ సినిమా జూన్ 16వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషలలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తిరుపతిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక కోసం చిత్ర బృందం మొత్తం తిరుపతి చేరుకున్నారు.

అయితే ఈ వేడుక అనంతరం చిత్రబృందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే స్వామివారి దర్శనం అనంతరం ఆలయం వెలుపలకు రాగానే దర్శకుడు హీరోయిన్ కృతి సనన్ కు సెండ్ ఆఫ్ ఇస్తూ ఆమెను హగ్ చేసుకోవడమే కాకుండా ముద్దు పెట్టుకున్నారు. ఇలా పవిత్రమైనటువంటి ఒక కొండపై డైరెక్టర్ హీరోయిన్ కు ముద్దు పెట్టడంతో భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశంలో ఇలా ముద్దులు పెట్టడం ఏంటి అంటూ మండిపడుతున్నారు.

ఈ విషయం కాస్త వివాదంగా మారుతోందని తెలుస్తుంది. ఈ ఘటనపై పలువురు ఆలయ ప్రధాన అర్చకులు స్పందిస్తూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుమల కొండపై దర్శకుడు చేసిన పని తనకుచాలా బాధ కలిగించిందని ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా మరోసారి ఇలాంటి సంఘటనలు తిరుమల కొండపై జరగకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి అంటూ ఈయన టిటిడి అధికారులను కోరారు.

ఎంతో పవిత్రమైన ప్రదేశంలో ఇలాంటి చేష్టలు సరికాదని తెలిపారు. ఆలయంలోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఆలయ నియమాలను పాటించాలని,కొత్తగా పెళ్లయిన వారు వచ్చిన అక్కడే పెళ్లి చేసుకున్న జంటలు కూడా ఆలయ నియమాలను పాటిస్తారు. కానీ ఇలా (Om Raut) డైరెక్టర్ హీరోయిన్ కు ముద్దు పెట్టడం పట్లమండిపడ్డారు సీనియర్ హీరోలు అయినా ఎన్టీఆర్ ఏఎన్నార్ వంటి వాళ్లు రాముడు కృష్ణుడి పాత్రలలో నటించారు ఇక నాగార్జున కూడా కూడా ఇలా దేవుళ్ళ పాత్రలో నటించినప్పటికీ ఆలయానికి వస్తే చాలా హుందాగా వ్యవహరించేవారని ఈయన ఈ సందర్భంగా తెలియజేశారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus