Manchu Lakshmi: లక్ష్మీ మంచు టాటూ వెనుక అంత కథ ఉందా?

లక్ష్మీ మంచు (Manchu Lakshmi) ఈ మధ్య కాలంలో ఎవ్వరూ ఊహించని విధంగా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తుంది. గతంలో ఆమె ఇలా చేసింది లేదు. కానీ ఇప్పుడు ఆమె వరుస సినిమాల్లో లీడ్ రోల్స్ కూడా చేస్తుంది. యూత్ కి దగ్గరగా ఉండాలి అంటే.. ఆ మాత్రం తప్పదు అనుకుంటుందో ఏమో కానీ, మునుపెన్నడూ లేని విధంగా గ్లామర్ డోస్ పెంచేసింది. అన్నీ ఎలా ఉన్నా మంచు లక్ష్మీ ఇటీవల ఓ ఫోటోని షేర్ చేసింది.

అందులో ప్రైవేట్ పార్ట్ పై టాటూ వేయించుకున్నట్టు లక్ష్మీ మంచు కనిపిస్తుంది. లక్ష్మీ మంచు అంతకు ముందు కూడా టాటూ పిక్స్ షేర్ చేసింది. కానీ ఇదే హాట్ టాపిక్ అయ్యింది అని చెప్పాలి. ఈ టాటూ వెనుక కొంచెం ఎక్కువ కథే ఉంది. ఇది నాగ టాటూ అట. ఓ గిరిజన సంస్కృతిని గౌరవిస్తూ ఆమె ఈ టాటూ వేయించుకున్నట్టు తెలుస్తుంది. ‘మో నాగ’ అనే ఆర్టిస్ట్ తో మంచు లక్ష్మీ ఈ టాటూ వేయించుకుందట. ప్రత్యేకంగా ముంబై వెళ్లి..

ఈ టాటూ వేయించుకోవడానికి 4 గంటల పాటు టైం కేటాయించిందట లక్ష్మీ మంచు. జాలి, దయ, కరుణ వంటి వాటిని కలిగి ఉండే ధైర్యవంతురాలు అనే అర్ధాన్ని ఈ టాటూ సూచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. లక్ష్మీ మంచు చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది. అలాగే పరభాషా చిత్రాల్లో కూడా స్పెషల్ రోల్స్ చేస్తుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus