Johnny: పవన్ కళ్యాణ్ జానీ ఫ్లాప్ కావడానికి అసలు కారణం ఇదేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాల్లో భారీ అంచనాలతో విడుదలై ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న సినిమాలలో జానీ (Johnny) సినిమా ఒకటి. పవన్ అభిమానులలో చాలామందికి ఈ సినిమా నచ్చినా కమర్షియల్ గా ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడానికి క్లైమాక్స్ అసలు కారణం అని సమాచారం. పవన్ కళ్యాణ్ మొదట ఈ సినిమాకు రాసుకున్న క్లైమాక్స్ ఒకటి కాగా సాడ్ ఎండింగ్ తో ఈ క్లైమాక్స్ ను పవన్ ప్లాన్ చేశారట.

అయితే కొంతమంది మాత్రం అలా చేయొద్దని పవన్ కు సూచించడంతో పవన్ కళ్యాణ్ క్లైమాక్స్ లో మార్పులు చేశారట. పవన్ కళ్యాణ్ క్లైమాక్స్ లో మార్పులు చేయకుండా ఉండి ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరోలా ఉండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో సినిమాలలో నటించలేదు. పవన్ ఎన్నికల్లో మంచి ఫలితాలను సొంతం చేసుకోగా పవన్ కళ్యాణ్ సినిమాల షెడ్యూల్స్ కు సంబంధించి త్వరలో క్లారిటీ రానుంది.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పవన్ కళ్యాణ్ భారీ విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. పవన్ కొత్త సినిమాలకు ఇప్పట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ లేదు. పవన్ కళ్యాణ్ ఏ మంత్రి పదవి తీసుకుంటారో తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో సినిమాలకు గుడ్ బై చెప్పడం తమకు ఇష్టం లేదని అభిమానులు చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ సినిమాల్లో, రాజకీయాల్లో ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించాలని మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. పవన్ కెరీర్ ప్లానింగ్స్ కు సంబంధించి త్వరలో పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus