Actress: ఆ స్టార్ హీరోయిన్ మద్యానికి బానిస అవ్వడానికి కారణం అతడేనా..!

సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అందంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఎంతో మంది నటీనటులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. కొందరు కొన్నేళ్ల పాటు కెరీర్ కొనసాగిస్తే.. మరి కొందరు ఒకటి రెండు సినిమాలు చేసి ఫేడవుట్ అవుతుంటారు. మరికొందరు గతంలో హీరోయిన్స్ గా నటించి కొంత కాలం తర్వాత సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తూ మరింత పాపులారిటీ అందుకుంటున్నారు. మరి కొంతమంది మాత్రం ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుని కొన్ని కారణాల చేత చిత్ర పరిశ్రమకు దూరం అవుతున్నారు.

అలాంటి వారిలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రచన కూడా ఒకరు. బెంగాలీ సినిమాల్లో హీరోయిన్ నటించిన రచన.. డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో జేడీ చక్రవర్తి హీరోగా చేసిన నిన్ను ప్రేమిస్తున్నాను సినిమా ద్వారా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత మెగా స్టార్ చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. చిరంజీవితో బావగారు బాగున్నారా.. బాలకృష్ణతో సుల్తాన్ సినిమాలలో నటించి మరింత క్రేజ్ సంపాదించుకుంది.

అలా సినిమాలు చేస్తున్న క్రమంలోనే తన భర్తతో ఏర్పడిన కొన్ని సమస్యల కారణంగా భర్త నుంచి విడిపోయింది. ఇలా డిస్టర్బ్ అయిన రచన మద్యానికి బానిసై షూటింగ్ లకు తాగి వెళ్లేదట. అంతేకాకుండా అందరి ముందు సిగరెట్లు తాగుతూ ఉండడం వల్ల ఆమె బిహేవియర్ కరెక్ట్ గా లేదన్న ఉద్దేశంతోనే తనను సినిమాల్లో తీసుకోలేదట.

అలా ఒక్కసారిగా హీరోయిన రచన సినీ కెరియర్ పడిపోయిందట. వాస్తవానికి ఈమె ఎన్నో మంచి సినిమాలలో నటించి.. మరిన్ని మంచి అవకాశాలు వస్తున్న క్రమంలోనే తన కెరీర్ ను చేజేతులా నాశనం చేసుకుందని అంటున్నారు. ఇలా హీరోయిన్ (Actress) రచననే కాకుండా.. చాలామంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus