Tejaswi Madivada: తేజస్వి ఎలిమినేషన్ కి అతడే కారణమా ? అసలు ఏం జరిగిందంటే..?

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో గేమ్ చక్కగా ఆడుతున్న తేజస్వి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యంది. నిజంగా ఓటింగ్ ప్రకారమే తేజస్విని ఎలిమినేట్ అయ్యిందా ? లేదా కావాలనే తేజుని హౌస్ నుంచీ పంపించేశారా అంటూ బిగ్ బాస్ వ్యూవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది చాలా అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. తేజస్వి, స్రవంతి ఇద్దరూ ఎలిమినేషన్ లో ఉన్నప్పుడు తేజు కొద్దిగా ధైర్యంగానే ఉంది. హౌస్ మేట్స్ అందరూ స్రవంతి వెళ్లిపోతుందనే అనుకున్నారు. కానీ, తేజస్వి ఎలిమినేట్ అయ్యేసరికి అస్సలు ఊహించలేదు.

Click Here To Watch NOW

షాక్ కి గురి అయ్యారు. తేజు ఎలిమినేట్ అనగానే అరియానా వెంటనే రియాక్ట్ అయ్యింది. మిగతా హౌస్ మేట్స్ అసలు ఈ విషయాన్ని నమ్మలేకపోయారు. స్టేజ్ పైకి వచ్చిన తర్వాత నాగార్జున కూడా అసలు నేను కూడా నమ్మలేదని, తేజు నువ్వు గేమ్ చాలా బాగా ఆడావని ఎప్రిషియేట్ చేశారు. అసలు ఏం జరిగిందంటే., తేజస్వి వెళ్లిపోతుంటే నటరాజ్ మాస్టర్ వెక్కి వెక్కి ఏడ్చాడు. మాస్టర్ ఏడవకండి. మీరే నన్ను పంపించారు కదా అంటూ మాట్లాడింది తేజు.

నిజానికి తేజస్వి ఈవారం నామినేషన్స్ లో లేదు. కానీ, నటరాజ్ మాస్టర్ అనూహ్యంగా తేజస్విని స్వాప్ చేశారు. తేజస్వి స్వాప్ అయ్యేసరికి నామినేషన్స్ లోకి రావాల్సి వచ్చింది. అంతేకాదు, నామినేషన్స్ అప్పుడు కూడా కేవలం నటరాజ్ మాస్టర్ మాత్రమే తేజస్వి ని బ్లేమ్ చేస్తూ ఓటు వేశారు. ఎన్నో పెద్ద పెద్ద నిందలు వేశారు. నువ్వు అన్నం పెట్టావ్ కానీ, అందులో విషయం పెట్టావ్ అంటూ తేజస్వి గురించి మాట్లాడారు. కావాలనే నామినేట్ చేశారు. దీంతో తేజు ఎలిమినేట్ అవ్వక తప్పలేదు. ఎలిమినేట్ అయ్యేటపుడు చాలా బాధపడ్డారు.

తేజు కూడా ఏడుస్తూనే ఎమోషనల్ గా హౌస్ మేట్స్ కి గుడ్ బై చెప్పి స్టేజ్ పైకి వచ్చింది. నిజానికి తేజస్వి గేమ్ సీజన్ 2తో పోలిస్తే చాలా బెటర్ గేమ్ ఆడింది. ఓటీటీ సీజన్ లోకి రావడం వల్ల తనకి ఉన్న బ్యాడ్ నేమ్ పూర్తిగా పోయింది. తన గేమ్ చూసిన వాళ్లు అందరూ కూడా బాగా ఇష్టపడ్డారు. ముఖ్యంగా స్టార్టింగ్ స్మిమ్మింగ్ పూల్ గేమ్ ని బాగా ఎనలైజ్ చేసింది. వారియర్స్ టీమ్ ని ముందుకు నడిపింది. అంతేకాదు, ఫస్ట్ వీక్ కెప్టెన్ అయి, తన గేమ్ పవర్ ఏంటో కూడా చూపించింది.

తను స్టేజ్ పైన చెప్పినట్లుగానే టైమ్ కోసం వెయిట్ చేసింది. ఎలిమినేట్ అవుతానని అస్సలు ఊహించలేదు. ఆ సీజన్ లో కౌషల్ ప్రభంజనం వల్ల కొద్దిగా నెగిటివిటీ వచ్చినా, ఇప్పుడు మాత్రం ఫుల్ పాజిటివిటీతో ఇంట్లో నుంచీ బయటకి వచ్చింది తేజు. అప్పుడు అలా ఆడితే , ఇప్పుడు ఇలా ఆడింది. ఏది ఏమైనా తేజస్వి ఈసారి బిగ్ బాస్ వ్యూవర్స్ ని బాగా ఇంప్రెస్ చేసిందనే చెప్పాలి.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus