Nithya Menon: నిత్యా మేనన్ పెళ్ళి పై సీనియర్ నటుడి సంచలన కామెంట్లు!

Advertisement

30 ఏళ్ల వయసు దాటిన హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ పెళ్ళి టాపిక్ లు నిత్యం చర్చనీయాంశం అవుతూ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు పెళ్ళి చేసుకుంటారు ఎవరిని పెళ్ళి చేసుకుంటారు వంటి అంశాల పై అనమాట. ఈ లిస్ట్ లో నిత్యా మేనన్ కూడా ఉంది. ఆమె వయసు 34 ఏళ్ళు. ఆమె సినీ పరిశ్రమలోకి అడ్డుపెట్టి 20 ఏళ్ళు దాటింది. అయినా ఇంకా పెళ్ళి చేసుకోలేదు. తనపై వచ్చే పెళ్ళి రూమర్స్ ను ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూనే ఉంటుంది ఈ బ్యూటీ.

అయితే నిత్యా మేనన్ పెళ్ళి చేసుకోకపోవడానికి కారణం ఇదే అంటూ ఓ తమిళ సీనియర్ నటుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. తాజాగా తమిళ సీనియర్ నటుడు బైల్వాన్‌ రంగనాథన్‌.. నిత్యా మీనన్‌ పై అలాగే ఆమె పెళ్లి టాపిక్ పై చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అతను మాట్లాడుతూ.. ” నిత్యా మేనన్ పెళ్ళి చేసుకోకపోవడానికి ఓ బలమైన కారణం ఉంది. అయితే అది ఆమెకు సంబంధించింది కాదు.

కానీ దానిని చాలా పర్సనల్ గా తీసుకుంది. అదేంటంటే.. కొన్నేళ్ల క్రితం ఓ ప్రముఖ మలయాళ నటి పెళ్లి చేసుకుంది. కానీ ఆమె వరకట్నం, గృహహింస వంటి కారణాలతో ఆత్మహత్య చేసుకుంది. ఈ వార్తను నిత్యా మేనన్ చాలా పర్సనల్ గా తీసుకుంది. ఈ వార్తతోనే ఇప్పటికీ (Nithya Menon) నిత్యా భయపడుతుంది. అందుకే ఆమె పెళ్ళి చేసుకోవడం లేదు” అంటూ చెప్పుకొచ్చింది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus